Begin typing your search above and press return to search.
నిర్మాతను కంట్రోల్ చేస్తున్న రాజమౌళి!
By: Tupaki Desk | 10 Oct 2022 4:21 AM GMTదర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకువచ్చినా కూడా దానికంటే ముందు పక్క ప్రణాళికతోనే ప్రమోషన్స్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటూ ఉంటాడు. సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలైనప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత జరిగే ప్రమోషన్స్ వరకు అన్నీ కూడా తన సలహాలతోనే కొనసాగుతూ ఉంటాయి. ఒక విధంగా రాజమౌళి ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. అలాగే ఎవరైనా సలహాలు ఇస్తే వెంటనే వాటిని తీసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడడు.
ఇక మహేష్ బాబుతో తన సరికొత్త పాన్ ఇండియా సినిమాను మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కొంతవరకు ఫినిష్ అయ్యాయి. బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమయ్యే వరకు షూటింగ్ అయితే మొదలు పెట్టకూడదు అని అనుకుంటున్నారు.
అయితే మరోవైపు రాజమౌళి గ్రాఫిక్స్ కోసం కొన్ని ప్రముఖ కంపెనీలను కూడా కలుస్తున్న విషయం తెలుస్తోంది. గ్రాఫిక్స్ ని బట్టి అలాగే ఆ బడ్జెట్ ఎస్టిమేషన్ను బట్టి కూడా రాజమౌళి తన సన్నివేశాల విషయంలో ఒక క్లారిటీకి రాబోతున్నాడు.
అయితే అక్టోబర్ 10 నేడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేద్దామని నిర్మాత చాలా ప్రయత్నాలు చేశాడట. ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ తప్పితే ఎలాంటి పోస్టర్ గాని ఫోటోలు గాని విడుదల కాలేదు. అయితే నిర్మాత మాత్రం కేఎల్ నారాయణ రాజమౌళితో ఇటీవల చర్చలు జరిపినప్పుడు కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అన్నారట.
కానీ మహేష్ బాబు సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టే ఇప్పుడే అంతగా తొందరపడవద్దు అని రాజమౌళి నిర్మాతను కంట్రోల్లో పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఇక మరోవైపు మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను ఈ ఏడాదిలో పూర్తిచేసి ఆ తర్వాత రాజమౌళితో కలవబోతున్నాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది సమ్మర్లో లేదా ఆ తర్వాత మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇక సినిమా మాత్రం 2025 సంవత్సరంలో రావచ్చని కూడా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.