Begin typing your search above and press return to search.
బాహుబలిని పిలిచిన పాకిస్థాన్
By: Tupaki Desk | 28 March 2018 6:13 AM GMTఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని ఒక్కసారిగా షేక్ చేసిన బాహుబలి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వారి ఖ్యాతిని ఒక్కసారిగా పెంచేసిన ఆ సినిమా ఇతర దేశాల అభిమానులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఐదేళ్ల కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఇంకా దక్కుతూనే ఉంది. ఎక్కడికెళ్లినా ఆ సినిమాకు సంబంధించిన వారిని ఈజీగా గుర్తు పట్టేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడైన రాజమౌళి స్థాయి చాలా వరకు పెరిగిందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇప్పటివరకు ప్రపంచంలో సినిమాలకు సంబంధించిన ఏ ఫెస్టివల్ జరిగినా కూడా బాహుబలి పేరు వినిపించేది. బాహుబలి కోసం చిత్ర యూనిట్ దాదాపు ముఖ్యమైన దేశాలన్నటిని కవర్ చేసింది. అయితే ఎవరు ఉహించని విధంగా దాయాధి దేశమైన పాకిస్థాన్ కూడా తెలుగు కళను మెచ్చింది. బాహుబలి హిందీలో రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి బాహుబలి టీమ్ కు ఇన్విటేషన్ అందింది.
ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళి తెలిపాడు. కరాచీ లో జరిగే ఆ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి చాలా మంది సెలబ్రిటీలు రాబోతున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో దేశాలు తిరిగినా రాజమౌళి ఇప్పుడు పాకిస్థాన్ పిలవగానే చాలా ఆసక్తిగా ఏగ్జైటింగ్ ఫీలవుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తారక్ - ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.