Begin typing your search above and press return to search.
డబ్బులేకపోవడమే క్రిష్ కు ప్లస్ అయ్యింది
By: Tupaki Desk | 21 Jan 2017 6:28 AM GMTఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణిని ప్రమోట్ చేయడానికి రాజమౌళి కూడా రంగంలోకి దిగిపోయాడు. గతంలో తన స్నేహితుడు త్రికోటి.. అలాగే తన ఫ్యామిలీకి దగ్గర వారైన కొందరి సినిమాల కోసం వారిని స్పెషల్ ఇంటర్యూలు చేసిన రాజమౌళి.. ఇప్పుడు క్రిష్ ను కూడా ఒక ఇంటర్యూ చేసేశాడు. ఈ ఇంటర్యూలో అనేక సంగతులు బయటపడ్డాయ్.
అసలు 79 రోజుల్లో సినిమాను ఎలా పూర్తి చేశావ్ చెప్పు అంటూ రాజమౌళి అడిగేశాడు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు.. మీరు ఫస్టు కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచేశాడో చెప్పాలంటూ క్రిష్ ఒక లాక్ వేశాడు. కట్ చేస్తే.. క్రిష్ ఈ 79 రోజులకు వివరణ ఇచ్చేశాడులే. ''నిజానికి మీరు (రాజమౌళి) ఎక్కువ గ్రాఫిక్స్ లేకుండా షూట్ చేస్కో అన్నారుగా.. అదే ప్లస్ అయ్యింది. దాదాపు అన్ని రియల్ లొకేషన్లలోనే షూట్ చేశాను. అయితే మా దగ్గర బడ్జెట్ చాలా తక్కువ ఉంది. కాబట్టి పొద్దున్న 6 గంటల నుండి రాత్రి 9 గంటలవరకు అస్సలు తీరిక లేకుండా పనిచేశాం. టైమ్ కాస్త కూడా వేస్ట్ చేయలేదు. అందుకే షార్ట్ టైమ్ లో సినిమా పూర్తయ్యింది'' అంటూ క్రిష్ వివరణ ఇచ్చేశాడు.
ఇకపోతే బాక్సాఫీస్ దగ్గర గౌతమిపుత్ర శాతకర్ణి ఆల్రెడీ ఒక రేంజులో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/