Begin typing your search above and press return to search.
జక్కన్న లెక్కలకు సెట్ అయితేనే ... ?
By: Tupaki Desk | 19 Dec 2021 10:37 AM GMTజక్కన్న ముద్దు పేరు, దర్శక ధీరుడు అభిమానులు ఇచ్చిన బిరుదు. ఎస్ ఎస్ అంటూ ఇంటి పేరుని వెంటబెట్టుకుని వరస సక్సెస్ లను కొట్టే ఒంటి పేరే రాజమౌళి. ఆయనతో సినిమా అంటే ఎవరికైనా దశ తిరిగినట్లే. హిట్ కోసం వాచిపోయేవారికి కూడా సక్సెస్ టేస్ట్ చూపించి ఫుల్ మీల్స్ ఇచ్చే కెపాసిటీ ఆయన సొంతం. కానీ ఆయనతో ఓర్చుకోవాలి. చాలా నేర్చుకోవాలి. మారిపోయే క్యాలండర్లను అసలు చూడకూడదు, జక్కన్న చెక్కుడుకి అరిగి కరిగి అందమైన శిల్పంగా మారితేనే ఇక చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ దక్కుతుంది.
రాజమౌళి ఇప్పటి దాకా చేసిన సినిమాలు డజన్ పైదాటి మాత్రమే ఉంటాయేమో. అందులో ఎక్కువ చేసింది ఎవరూ అంటే జూనియర్ ఎన్టీయార్ పేరు మొదట చెప్పుకోవాలి. ఆయన వరసగా నాలుగు సినిమాలు చేశారు. అంటే జక్కన జూనియర్ ల మధ్య బాడింగ్ ఎంత బాగా కుదిరిందో మరి. ఇక రామ్ చరణ్ రెండు సార్లు చేస్తే ప్రభాస్ రెండు సార్లు చేశారు. మిగిలిన వారు అంతా ఒక్క సారికే ముచ్చట తీర్చుకున్నారు.
ఇక రాజమౌళి బాహుబలి తరువాత ఆలిండియాలోనే నంబర్ వన్ డైరెక్టర్ అయిపోయాడు. రాజమౌళితో మొదట సినిమాలు చేయడానికి ఇష్టపడని వారంతా కూడా ఇపుడు తమతో చేయాలని అడుగుతున్నారు. ఇక రాజమౌళి తాను ఫలానా హీరోతో సినిమా చేస్తానని వెంటబడి అడిగిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నాడు ఏ కారణం చేతనో కాంబినేషన్ కుదరని వారు ఇపుడు మన కాంబోలో మూవీ రావడంలేదు అంటున్నారు.
కానీ ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే రాజమౌళి కధను ప్రేమిస్తారు, దాన్ని బట్టే హీరో. ఆ హీరో కూడా తనతో అన్ని విధాలుగా మౌల్డ్ అయి సుదీర్ఘ కాలం ట్రావెల్ అయ్యే వారై ఉండాలి. ఇక సీనియర్లు కానీ ఇతర బిజీ హీరోలు కానీ అయితే జక్కన్న లెక్కల్లో తేడాలు వచ్చేస్తాయి. అందుకే ఆయన చాలా తెలివిగా వినయంగా నేను హ్యాండిల్ చేయలేను అని చెప్పేస్తారు.
లేటెస్ట్ గా అన్ స్టాపబుల్ షోలో స్వయంగా సీనియర్ హీరో బాలయ్య మన కాంబో ఎపుడు అని ఫ్యాన్స్ అడుగుతున్నారు అంటే దానికి రాజమౌళి మీతో చేయాలంటే టెన్షన్ వచ్చేస్తుంది సర్ అని తెలివిగా చెప్పేసి తప్పించుకున్నాడు అంటున్నారు. ఇక రాజమౌళి చేసే హీరోల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని అంటున్నారు.
ఇక రాజమౌళి స్టార్టింగ్ లో ఒకటి రెండు సినిమాలు స్టార్స్ తో చేయకపోవచ్చు కానీ ఇపుడు మాత్రం ఆయన కచ్చితంగా పాన్ ఇండియా అప్పీల్ ఉన్నవారినే చూసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఇక రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్ కాక ముందు టాలీవుడ్ లో ఒక సీనియర్ నటుడు తన వారసుడితో సినిమా చేయమని అడిగారట. కానీ తరువాత చేద్దామని రాజమౌళి చెప్పడంతో ఆ కాంబో ఈ రోజుకీ కుదరలేదని చెబుతారు.
ఇక అల్లు అర్జున్ లాంటి వారు కూడా రాజమౌళి తో కలసి పనిచేయాలని చూస్తున్నారు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో రాజమౌళి మూవీ ఉంటే బాగుంటుంది అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరో వైపు మెగాస్టార్ రాజమౌళి చేయాలని కోరుకునేవారు ఉన్నారు. కానీ రాజమౌళి మాత్రం తన లెక్కలు తనకు ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి చాలా కాంబోలు సెట్ అవుతాయాలేదా అంటే కాలమే జవాబు చెప్పాలి. మొత్తానికి రాజమౌళి తానే చెప్పుకున్నట్లుగా ఒకనాడు అవకాశాల కోసం చాలా మందిని కలిశారు, ఇపుడు ఆయనతో పనిచేయడానికి చాలా మంది చూస్తున్నారు. సో ఆయన ఎంత హైట్స్ కి వెళ్ళారు అన్నది కనుక అంచనా వేసుకుంటే హీ ఈజ్ గ్రేట్ అనిపించకమానదు.