Begin typing your search above and press return to search.
#RRR ట్రీట్.. పండగొస్తే వదిలి పెట్టరట!
By: Tupaki Desk | 30 Dec 2019 4:57 AM GMT2020 మోస్ట్ అవైటెడ్ మూవీగా RRR పేరు మార్మోగుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి దర్శకుడు రాజమౌళి నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా సినిమాగా దేశవ్యాప్తంగా ఈ సినిమాకి పాపులారిటీ దక్కింది. కొత్త ఏడాదిలో స్థానిక మీడియాతో పాటు.. జాతీయ మీడియాని ఆకర్షించే క్రేజీ తెలుగు సినిమా ఇదేననడంలో ఎలాంటి సందేహం లేదు. డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించి.. ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన విషయాల్ని అప్ టు డేటెడ్ గా వండి వార్చడంలో జాతీయ మీడియా పోటీపడుతూనే ఉంది. అయితే ఇంకా ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ లుక్ సస్పెన్స్ వీడకపోవడం..టైటిల్ సస్పెన్స్ ఇంకా కొనసాగుతుండడం ప్రధానంగా చర్చకొస్తోంది.
ఎట్టకేలకు కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1 న ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారన్న ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే అధికారికంగా దీని గురించి టీమ్ ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకూ జక్కన్న కానీ తారక్ .. చరణ్ లలో ఎవరో ఒకరు కానీ దీనిపై స్పందించనే లేదు. అసలు ఈ చిత్రానికి టైటిల్ ని ఫైనల్ చేసేందుకు ఎందుకు తటపటాయిస్తున్నారు? అన్నది తేలాల్సి ఉంది.
ఓ క్లోజ్ సోర్స్ ప్రకారం.. జూలై 30న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించిన బ్యాలెన్స్ పనుల్ని వేగంగా పూర్తి చేస్తూనే ఇకపై ప్రచారం పరంగానూ స్పీడ్ పెంచాలని దానయ్య బృందం ప్రిపరేషన్స్ లో ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ లుక్ రిలీజ్ డిసెంబర్ 31 మిడ్ నైట్ లేదా జనవరి 1న ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ప్రతి పండక్కి ఏదో ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు డీవీవీ సోషల్ మీడియా సిద్ధమవుతోందట. అంటే రకరకాల పోస్టర్లు సహా ఈ సినిమాకి సంబంధించిన విజువల్ గ్లింప్స్ ని ట్రీట్ కి రెడీ చేయిస్తున్నారనే దీని అర్థం. ఇంతకుముందు భరత్ అనే నేను చిత్రానికి ఇలాంటి ప్రచారమే చేసింది డీవీవీ యూనిట్. ఇప్పుడు దానినే కొనసాగించనున్నారని అంచనా వేస్తున్నారు. దాదాపు ఐదారు భాషల్లో ఒకేసారి రిలీజవుతున్న ఈ సినిమాకి జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రచారం చాలా అవసరం. ఆ మేరకు ముందస్తు జాగ్రత్త తీసుకోనున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.