Begin typing your search above and press return to search.
రాజమౌళికి నచ్చిన ఒక ట్రైలర్
By: Tupaki Desk | 22 May 2018 8:17 AM GMTదర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడో కానీ ట్వీట్ చేయడు. తనకేదైనా సినిమా ప్రోమో బాగా నచ్చినా.. లేదంటే తనకు తెలిసిన వాళ్లకు సంబంధించిన సినిమాలకు సంబంధించి విశేషాలు బయటికి వచ్చినా వాటి గురించి ట్వీట్ చేస్తుంటాడు. అలాగే కొత్త సినిమా ఏదైనా చూసి నచ్చినా దాని గురించి స్పందించాడు. ఐతే తాజాగా జక్కన్న ఓ చిన్న సినిమా ట్రైలర్ గురించి ట్వీట్ చేయడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళికి ఏమైనా స్టేక్స్ ఉన్నాయా లేక నిజంగానే ఆ ట్రైలర్ నచ్చి ట్వీట్ చేశాడా అన్నది తెలియదు. కానీ ఆ చిన్న సినిమాకు రాజమౌళి ట్వీట్ మాత్రం గొప్ప ప్రయోజనాన్నే తెచ్చిపెట్టింది. జక్కన్న చెప్పాడు కాబట్టి లక్షల మందికి ఆ ట్రైలర్ చేరే అవకాశముంది. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటంటే.. సంజీవని. అందరూ కొత్తవాళ్లే నటించిన ‘సంజీవని’ ఒక అడ్వెంచరస్ మూవీ.
రవి వీడె అనే కొత్త దర్శకుడు రూపొందించిన ‘సంజీవని’లో అనురాగ్ దేవ్.. మనోజ్ చంద్ర.. తనూజ నాయుడు కీలక పాత్రలు పోషించారు. కొంతమంది యువతీ యువకుల బృందం అప్పటిదాకా ఎవ్వరూ వెళ్లని ఒక ప్రమాదకర ప్రదేశం తాలూకు గుట్టు విప్పడానికి చేసే సాహసయాత్ర నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ క్రమంలో వాళ్లను విచిత్ర జీవులు వెంటాడుతాయి. ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతారు. చివరికి ఎంతమంది మిగిలారు.. ఆ ప్రదేశం గుట్టు ఎలా విప్పారన్నది ఈ కథ. తక్కువ బడ్జెట్లోనే విజువల్ ఎఫెక్ట్స్ బాగానే తీర్చిదిద్దినట్లున్నారు. క్వాలిటీ కొంచెం అటు ఇటుగా అనిపిస్తున్నప్పటికీ అందరూ కొత్తవాళ్లను పెట్టి ఇలాంటి సినిమా తీయడం.. తక్కువ బడ్జెట్లోనే ఆ మాత్రం ఔట్ పుట్ తేవడం గొప్ప విషయమే. రాజమౌళి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. మొత్తానికి ట్రైలర్ అయితే ఆసక్తి రేకెత్తించేలాగే ఉంది. మరి ఇది సినిమాగా ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.