Begin typing your search above and press return to search.

భ‌ర‌త్ ను మెచ్చుకున్న జ‌క్క‌న్న‌

By:  Tupaki Desk   |   20 April 2018 12:12 PM GMT
భ‌ర‌త్ ను మెచ్చుకున్న జ‌క్క‌న్న‌
X
ఈరోజు విడుద‌ల‌యిన మ‌హేష్ బాబు ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాకు ఉద‌యం ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. యంగ్ ముఖ్య‌మంత్రిగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌ట‌న‌లో ఉతికి ఆరేస్తే... ద‌ర్శ‌కుడు కొరిటాల శివ క్లాస్ కీ మాస్ కీ న‌చ్చేలా అన్ని అంశాలు రంగ‌రించి పొలిటిక‌ల్ డ్రామా తీసాడ‌ని విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్పుడు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి కూడా భ‌ర‌త్ కి ఫిదా అయిపోయాడు.

‘భ‌ర‌త్ అనే నేను’ సినిమా చూసిన జ‌క్క‌న‌... ఎప్ప‌టిలాగే త‌న అభిప్రాయాన్ని ట్వీట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నాడు. ‘ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ప్రాంతీయ రాజ‌కీయాలు చూపించ‌డం చాలా క‌ష్టం. దానికి చాలా తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది. కొరిటాల శివ‌- మ‌హేష్ బాబు పెట్టుకున్న న‌మ్మ‌కానికి పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నా... ప్రెస్ మీట్ సీన‌యితే అదిరిపోయింది...’’ అంటూ ట్వీట్ చేసిన జ‌క్క‌న్న‌... మ‌హేష్ బాబు కెరీర్ లోనే ది బెస్ట్ ప‌ర్ఫామెన్స్ ఇచ్చాడ‌ని కొనియాడాడు. ప్ర‌తి ఒక్క‌రూ పాత్ర‌ల‌కు స‌రిగ్గా సరిపోయార‌ని- కాస్టింగ్ చ‌క్క‌గా చేశార‌ని నిర్మాత దాన‌య్య‌కి కంగ్రాట్స్‌... చెప్పాడు జ‌క్క‌న్న‌. చాలా రోజులుగా సినిమాల‌పై స్పందించ‌డం మానేసిన జ‌క్క‌న మొన్న ‘తొలిప్రేమ‌’- నిన్న ‘రంగ‌స్థ‌లం’ సినిమాల‌పై స్పందించాడు.

మొద‌టి సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ మంచి విజ‌యం సాధిస్తే... రెండోది నాన్‌- బాహుబ‌లి రికార్డుల‌న్నీ తిర‌గ‌రాసింది. ఇప్పుడు మ‌హేష్ బాబు ‘భ‌ర‌త్ అనే నేను’ కూడా ఆ రేంజ్ విజ‌యం సాధించి రికార్డులు తిర‌గ‌రాయ‌డం ప‌క్కా... అని తెగ ఖుషీగా జ‌క్క‌న ట్వీట్ల‌ని రీట్వీట్ చేస్తున్నారు సూప‌ర్ స్టార్ అభిమానులు.