Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమే ఎన్టీఆర్
By: Tupaki Desk | 29 Dec 2021 3:30 AM GMTరాజమౌళి దర్శకుడిగా తన కెరియర్ ను ఎన్టీఆర్ సినిమా 'స్టూడెంట్ నెంబర్ వన్' సినిమాతో మొదలుపెట్టారు. అందువలన అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ తరువాత వాళ్ల కాంబినేషన్లో వచ్చిన 'సింహాద్రి' .. 'యమదొంగ' సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లను నమోదు చేశాయి. అలా వాళ్లిద్దరూ కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు. ఇక చరణ్ తో రాజమౌళి చేసిన 'మగధీర' ఒక చరిత్ర సృష్టించింది. చరణ్ కి ఒక్కసారిగా స్టార్ డమ్ ను తెచ్చిపెట్టేసింది. అలాంటి ఇద్దరి హీరోలతో కలిసి రాజమౌళి రూపొందించిన భారీ సినిమానే 'ఆర్ ఆర్ ఆర్'
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చెన్నైలో నిర్వహించారు. ఈ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ .. "చాలా కాలం క్రితమే డీవీవీ దానయ్య గారు నాతో ఒక సినిమా చేయాలని అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఎప్పటికప్పుడు నేను నా సినిమాలు చేస్తూ వెళుతుండటంతో లేట్ అయింది. 'అయినా ఫరవాలేదు సార్' అంటూ ఆయన నాతో సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. అందుకు ముందుగా నేను ఆయనకి సారీ చెబుతున్నాను .. అలాగే థ్యాంక్స్ కూడా చెబుతున్నాను.
ఈ సినిమాకి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ గారికీ, కీరవాణి గారికి థ్యాంక్స్ అనే మాటలు సరిపోవు. నా కెరియర్లో వాళ్లు నాతో పాటు కలిసి ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమా కథ భారదేశమనే గడ్డపై పుట్టిన ఒక భావోద్వేగం. ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ కూడా చెరో వైపున రెండు ఫిరంగుల్లా ఉంటూ నాకు తమ సహాయ సహాకారాలను అందిస్తూ వచ్చారు. నాకంటే సీనియర్ అని చెప్పేసి ఎన్టీఆర్ తరచూ నాతో గొడవపడుతుంటాడు. నేను కూడా తనని బాగానే తిడుతుంటాను .. టైమ్ సెన్స్ లేదని. నిజంగానే ఆయన ఉదయం 7 గంటలకు రమ్మంటే 6 గంటలకే సెట్స్ కి వచ్చేస్తాడు.
ఈ సీన్ ను ఇలా చేస్తే బాగుటుందని నేను అనుకునేలోగానే, ఇలా చేస్తే బాగుంటుందా? అంటూ నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే చేసి చూపిస్తాడు. అలాంటి ఎన్టీఆర్ దొరకడం టాలీవుడ్ కి మాత్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చేసుకున్న అదృష్టం. ఇక చరణ్ విషయానికి వస్తే నేను ఆయనను 'మై హీరో' అని పిలుస్తుంటాను. ఎప్పుడు చూసినా ఏదో ధ్యానంలో ఉన్నట్టుగా చాలా కూల్ గా కనిపిస్తూ ఉంటాడు. ఏం చేయాలన్నా .. ఎంత చేయాలన్నా వెనుకాడడు. ఎన్టీఆర్ ఒక లక్ష్యం వైపు దూసుకుపోతున్నట్టుగా కనిపిస్తాడు. చరణ్ మాత్రం స్థిరమైన వ్యక్తిత్వంతో నిండుకుండలా అనిపిస్తాడు" అని చెప్పుకొచ్చారు.