Begin typing your search above and press return to search.
వారికి ప్రతీ సినిమాతో సంబంధం ఉంది
By: Tupaki Desk | 18 Jan 2018 12:57 PM GMTఇండియాలో బాలీవుడ్ ఎంత స్పీడ్ గా అభివృద్ధి చెందిందో తెలియదు గాని మన టాలీవుడ్ మాత్రం దానికంటే స్పీడ్ గా అబివృద్ది చెందింది అని చెప్పవచ్చు. అంతే కాకుండా ఇంకా హాలీవుడ్ స్థాయిలో కూడా డెవెలప్ అవుతోందని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగా హైదరాబాద్ లో టెక్నాలజీ పరంగా కొందరు చేస్తోన్న ప్రయత్నం నిజంగా గొప్ప విషయమని చెప్పాలి. ముఖ్యంగా ఎల్వీ ప్రసాద్ గ్రూప్స్ టాలీవుడ్ కి అన్ని విధాలుగా ఉపయోగపడుతోంది.
టాలీవుడ్ లో ఏ సినిమా తెరకెక్కినా ఎదో ఒక విధంగా అక్కడి ల్యాబ్స్ నుంచి వెళ్లి తీరాల్సిందే. ఎడిటింగ్ డబ్బింగ్ రీ రికార్డింగ్ గ్రాఫిక్స్ మొదలగు ముఖ్యమైన పనులతో పాటు సినిమా వేడుకలకు సంబంధించిన ఇతర కార్యక్రమలు ఏవైనా ప్రసాద్స్ ల్యాబ్స్ లో జరుగుతుంటాయి. ఇదే విషయాన్ని ఇటీవల రాజమౌళి తెలిపారు. రీసెంట్ గా ఎల్వీ ప్రసాద్ గారి 110 జన్మదిన సందర్భంగా చిన్న ఈవెంట్ ని చేశారు. ఈ మీటింగ్ లో రాజమౌళి తనదైన శైలిలో మాట్లాడి అందరిని ఆకట్టుకున్నారు.
ఆయన మాట్లాడుతూ.. ఒక సినిమా మంచి విజయం సాధించింది అంటే చిత్ర యూనిట్ మొత్తానికి ఆ క్రెడిట్ దక్కుతోంది. అలాగే అందులో ప్రసాద్ గ్రూప్స్ పేరు కూడా ఉంటుందని గడిచిన 50 ఏళ్ల నుంచి వస్తోన్న ప్రతి సినిమాలో ఎల్వి ప్రసాద్ గ్రూప్స్ కూడా భాగం అవుతూ వస్తోందని అన్నారు. ముఖ్యంగా పరిశ్రమ కు కొత్త టెక్నాలజీ ని తీసుకురావడంలో ఎల్వి వారు ముందుంటారు అని బాహుబలి సినిమాకు ఆటమోస్ లో మిక్సింగ్ చేయాలని అనుకున్నప్పుడు రమేష్ ప్రసాద్ గారిని అడగ్గానే వెంటనే స్పందించారని చెప్పారు. అసలు దానికి ఎంత ఖర్చు అవుతోందని ఆలోచించకుండా లేటెస్ట్ గా ఉన్న మోస్ట్ ఎక్విప్మెంట్ ని తెప్పించి 2 నెలల్లో ఇన్ స్టాల్ చేయించారని రాజమౌళి వివరించారు.