Begin typing your search above and press return to search.
పెద్దన్న కోసం జక్కన్న ట్వీటాడుగా!!
By: Tupaki Desk | 29 Aug 2016 5:30 PM GMTటాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తనను తన సినిమాలను మాత్రమే కాకుండా.. మంచి సినిమాలకు కూడా ట్వీట్స్ పెడుతూ ఉంటాడు. అప్పటివరకూ జనాలు పట్టించుకోకపోయినా.. జక్కన్న ట్వీట్ పెట్టిన తర్వాత వాటి రేంజ్.. క్రేజ్ మారిపోతూ ఉంటాయి. అయితే.. పనిలో పనిగా తన కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ప్రమోషనల్ ట్వీట్స్ చేస్తూ ఉంటాడు రాజమౌళి.
తన దగ్గర పని చేసినవాళ్లు దర్శకులుగా మారినా.. తన కుటుంబసభ్యుల్లో ఎవరైనా కొత్తగా ఏదైనా చేసినా.. రాజమౌళి ట్వీట్ పడిపోతూ ఉంటుంది. రీసెంట్ గా రాజమౌళికి పెద్దన్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. డెట్రాయిట్ లైవ్ కాన్సర్ట్ ఒకటి చేశారు. ఈ కార్యక్రమం అందరినీ బాగానే ఆకట్టుకుంది. ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ను ట్వీట్ చేసిన రాజమౌళి.. తన సోదరుడి ప్రతిభ గురించి పొగిడేశాడు. ముఖ్యంగా కీరవాణి తన ఆర్కెస్ర్టా ను ఇంట్రొడ్యూస్ చేయడానికి.. ప్రతీ ఒక్కరి పేరును చెబుతూ.. వారు వాయించే వాద్యాన్ని చెబుతూ.. ఒక పాట రూపంలో వారిని పరిచయం చేశాడు. అదే చాలా బాగుంది అంటున్నాడు జక్కన్న.
'సాధారణంగా ప్రతీ మ్యూజిక్ డైరెక్టర్ తన టీమ్ ని ఇంట్రడ్యూస్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తాడు. కానీ ఈ ఎపిసోడ్ కి ఆడియన్స్ బోర్ ఫీలవుతూ ఉంటారు. కానీ కీరవాణి మాత్రం ఆర్కెస్ట్రా ఇంట్రడక్షన్ సాంగ్ పేరుతో.. ఓ కొత్త ఐడియా వేశాడు. ఆడియన్స్ నుంచి అప్లాజ్ అందుకున్నాడు' అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి. ఇలాంటి ఐడియాలు అటు రాజమౌళి దగ్గరా.. ఇటు కీరవాణి దగ్గరా చాలానే ఉంటాయ్ లెండి.