Begin typing your search above and press return to search.

ఒక్క పాట‌కు 70 మంది ఆర్కెస్ట్రా!

By:  Tupaki Desk   |   27 Sep 2019 12:33 PM GMT
ఒక్క పాట‌కు 70 మంది ఆర్కెస్ట్రా!
X
70 మంది ఆర్కెస్ట్రా.. 35 మంది బ్యాండ్ బృందం.. ఎంతో శ్ర‌ద్ధగా ప‌ని చేస్తే పుట్టుకొచ్చిన పాట ఇది అని అంటున్నారు ఎస్.ఎస్.థ‌మ‌న్. ఆయ‌న సార‌థ్యంలో అల వైకుంఠ‌పురములో చిత్రానికి పాట‌లు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న అనే తొలి పాట‌ను రికార్డింగ్ చేస్తున్నారు. ఈ మెలోడీని కంపోజ్ చేయ‌డానికి చాలా ఎగ్జ‌యిట్ అయ్యాడ‌ట త‌మ‌న్. ఇక దీనికోసం పూర్తిగా ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌పై ఆధార‌ప‌డ‌లేద‌ని చెబుతున్నాడు. ఈ పాట కంపోజిష‌న్ ద్వారా ఎమోష‌న‌ల్ హైని చూపిస్తున్నాన‌ని ఓ వీడియో చాట్ లో త‌మ‌న్ వెల్ల‌డించారు.

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న రికార్డింగ్ స‌మ‌యంలో ఎమోష‌న‌ల్ మూవ్ మెంట్ ని షూట్ చేసి వీడియోని లాంచ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. త‌మ‌న్ మాట్లాడుతూ.. అందుకు సంబంధించిన విష‌యాల్ని వెల్ల‌డించారు. అల‌వైకుంట‌పుర‌ములో తొలి పాట గురించి చాలా ఎగ్జ‌యిట్ అయ్యానని ఈ సంద‌ర్భంగా త‌మ‌న్ తెలిపారు.

త‌మ‌న్ మాట్లాడుతూ..`` బ‌న్నికి పాట‌లు చేయ‌డం అంటేనే ఠ‌ఫ్. చాలా ఆలోచించాల్సి ఉంటుంది. బ‌న్ని డ్యాన్సులకు త‌గ్గట్టు ఏదైనా పాట‌ను చేయాలంటే చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. త‌న కొరియోగ్ర‌ఫీ డిఫ‌రెంటుగా ఉంటుంది. ఐడియాలు వేరు. ఇంత‌కుముందు రేసుగుర్రం.. స‌రైనోడు చిత్రాల‌కు చేశాను. ఇప్పుడు త్రివిక్ర‌మ్ - బ‌న్ని గారితో ప‌ని చేస్తున్నా. వారి వ‌ర్కింగ్ స్టైల్ డిఫ‌రెంట్. వీళ్ల‌తో ప‌ని శైలి ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతూ ఉంటుంది. అలాగే సామ‌జ‌మ‌ర‌గ‌మ‌న అనే పాట‌ను చేయాల‌ని ఐడియా ఇచ్చారు. నేచుర‌ల్ సౌండ్స్ తో ఈ పాట‌ను చేయాల‌నుకున్నాం. పిల్ల‌న‌గ్రోవి స‌హా వ‌యోలిన్ ఇత‌ర‌త్రా లైవ్ ఇన్ స్ట్రుమెంట్స్ ఉప‌యోగించాను. ఇక ఈ పాట‌కు సీతారామ శాస్త్రి గారు ర‌చించారు. ది బెస్ట్ గా నిలిచే పాట ఇది. సిధ్ శ్రీ‌రామ్ పాట చాలా హార్ట్ ఫుల్ గా పాడాడు. అల్లు అర‌వింద్ .. హారిక సంస్థ ఈ ఆఫ‌ర్ ఇచ్చింది. వారికి థాంక్స్`` అని తెలిపారు.

ఇక లిరిక‌ల్ వీడియో బ‌దులుగా సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట‌ను లాంచ్ చేస్తున్నారు అంటే అది అభిమానుల‌కు పండ‌గే. త‌మ‌న్ సంగీతం పైనా అభిమానుల‌కు అంచ‌నాలున్నాయి. అల వైకుంట‌పుర‌ములో తొలిపాట కోసం వేచి చూడండి.