Begin typing your search above and press return to search.
SSMB 28.. వైల్డ్ లుక్ లో అర్జున్
By: Tupaki Desk | 3 Feb 2023 10:30 PM ISTఖైదీ, మాస్టర్, విక్రమ్ తదితర చిత్రాల్లో సహాయనటుడు, విలన్ పాత్రలు పోషించిన నటుడు అర్జున్‌దాస్. ముఖ్యంగా ఈ చిత్రాల్లో తన గంభీరమైన గొంతుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తన గొంతుతోనే తన పాత్రకు ప్రాణం పోశాడు. అలా మ్యాన్లీ లుక్స్తో, బోల్డ్ వాయిస్తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. దీంతో ఇండస్ట్రీలో ఆయనకు ఫుల్ క్రేజ్తో డిమాండ్ పెరిగింది. ఇక తెలుగులోనూ ఆయనకు మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఫిబ్రవరి 4న 'బుట్టబొమ్మ' చిత్రంతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆక్సిజన్ అనే చిత్రంలోనూ కీలకపాత్ర పోషించాడు. అయితే ఇప్పుడతడికి మరో సూపర్ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. ఏకంగా సూపర్స్టార్ మహేశ్ బాబు నటించబోయే సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. SSMB28లో వైల్డ్(భయంకరమైన) లుక్లో కనిపించనున్నాడట. అంటే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇకపోతే అర్జున్ దాస్ బుట్టబొమ్మ సినిమా విషయానికొస్తే.. ఫిబ్రవరి 4న విడుదల కానుంది. అనికా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ తెరకెక్కించారు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఘనంగా జరిగింది.ఇక SSMB28 విషయానికొస్తే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబో అతడు, ఖలేజాకు పని చేయడం వల్ల ఎస్ఎస్ఎంబీ 28పై భారీగా అంచనాలు ఉన్నాయి.
పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీలలు హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోని ఈ సినిమాకు అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది.
ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ రైట్స్ మొత్తం కలిపి రూ.100కోట్లకు కొనుగోలు అయ్యాయట. ఇక థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.200కోట్ల వరకు జరిగిందని తెలిసింది. దీంతో మొత్తంగా రూ.300కోట్లకు ఈ చిత్ర హక్కులు అమ్ముడు పోయాయని సమాచారం. ఇక ఈ చిత్రం బ్రెక్ ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా రూ.200కోట్లు ఉండొచ్చని అంచనా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.