Begin typing your search above and press return to search.
SSMB 28 రూమర్స్.. నిర్మాత ఏమన్నారంటే?
By: Tupaki Desk | 27 April 2023 4:48 PM ISTమహేష్ బాబు కొత్త సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చివరగా ఆయన సర్కారువారి పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన ఫలితం రాకపోవడంతో... ఎప్పుడెప్పుడు కొత్త సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. త్రివిక్రమ్ తో తెరకెక్కాల్సిన మహేష్ మూవీ కి వరసగా బ్రేకులు పడుతున్నాయి అనేది ఆ వార్తల సారాంశం.
త్రివిక్రమ్ సరిగా కథను, సినిమాను పట్టించుకోవడం లేదని అందుకే మహేష్ విసిగిపోయి ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి మహేష్ ప్రతి సంవత్సరం కుటుంబంతో కలిసి సమ్మర్ లో ట్రిప్ కి వెళుతూ ఉంటారు. పిల్లలకు సెలవలు వచ్చిన ప్రతిసారీ ఆయన కుటుంబంతో కలిసి కచ్చితంగా ఏదో ఒక దేశానికి ట్రిప్ కి వెళతారు. ఈ సమ్మర్ లో కూడా అలానే ప్లాన్ చేశారట.
అయితే, సమ్మర్ వెకేషన్ కు మహేష్ బాబు వెళ్తున్నాడని తెలిసిన నిర్మాతలు హీరోని కలిశారట. అయితే త్రివిక్రమ్ నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో క్లారిటీ ఇవ్వమని మహేష్ బాబు అడిగాడట. వారం రోజుల్లో చెబుతామని నిర్మాతలు అన్నారట. దీంతో ఈ వారం రోజుల్లో సమ్మర్ ట్రిప్ కు వెళ్లొస్తాను అని మహేష్ బాబు అన్నాడట. మూడు రోజులు వెకేషన్ కు వెళ్తానని అన్నట్టుగా సమాచారం అందుతోంది. దీని పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
ఈ ప్రచారాలు జోరందుకోవడంతో, వాటిని ఖండించడానికి నిర్మాతలు రంగంలోకి దిగారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదిగా ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అలాంటిదేమీ లేదని, అంతా సవ్యంగానే జరుగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు
'ఆహారం కోసం వెతికే సమయంలో పక్షులు ఏవిధంగా శబ్దాలు చేస్తాయో, అదేవిధంగా టెన్షన్ కోసం చాలా మంది రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి రూమర్స్ ని చూసి నవ్వుకోవడం, ఇగ్నోర్ చేయడం చాలా సులువు. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి ' అంటూ నాగ అశ్విన్ ట్వీట్ చేశారు.
అదేవిధంగా మహేష్ బాబు అభిమానులు ఆ రూమర్స్ నమ్మాల్సిన పనిలేదని, రూమర్స్ ని కేవలం విని వదిలేయమని, అనవసరంగా ఆలోచించవద్దంటూ పేర్కొన్నాడు. ఎలాంటి బ్రేకులు పడలేదని, సినిమా సవ్యంగా జరుగుతుంది ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు. కాగా, నాగ అశ్విన్ ట్వీట్ తో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.కాగా, ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.