Begin typing your search above and press return to search.
#SSMB అల్ట్రా స్టైలిష్ కాలేజ్ బోయ్ లా మారాడు
By: Tupaki Desk | 5 Dec 2020 9:13 AM GMTఏజ్ పెరిగినా కొందరి గ్లామర్ సర్ ప్రైజ్ చేస్తుంటుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున 50 ప్లస్ లో నూ ఛామింగ్ లుక్ స్టైలిష్ కంటెంట్ తో కట్టి పడేయడం ప్రతిసారీ చర్చకు వచ్చేది. ఇంటర్వ్యూల్లో ప్రతిసారీ నాగార్జున గ్లామర్ రహస్యం గురించి జర్నలిస్టులు ప్రశ్నించేవారంటే అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ అంతకుమించి యువతరంలో హాట్ టాపిక్ గా మారారు. ఆయన ఏజ్ లెస్ ఛామ్ ప్రస్తుతం ట్రెండీ టాపిక్ అవుతోంది. 45 ఏజ్ అంటే నమ్మడం కష్టమే. ఆయనకు 25 అంటే నమ్మేస్తారు. అంతగా అతడి మేకోవర్ సర్ ప్రైజ్ చేస్తోంది. ఇటీవల శ్రీమంతుడు- భరత్ అనే నేను-మహర్షి-సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుసగా ఏడాదికో సినిమా చేస్తుంటే సినిమా సినిమాకి ఏజ్ పెరుగుతున్నా.. అదేమీ కనిపించకుండా తగ్గించేస్తూ ఎంతో స్టైలిష్ గా ఛామింగ్ గా కనిపిస్తున్నారు అంటూ అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు.
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట చిత్రీకరణ కోసం రెడీ అవుతున్నారు మహేష్. ఈలోగానే తాజాగా రివీలైన ఓ ఫోటోలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ షాక్ కి గురి చేస్తోంది. ఆయనేమైనా కాలేజ్ బోయ్ నా? అంటూ అమ్మాయిలంతా ఒకటే ఇదైపోతున్నారు ఈ రూపం చూసి. వైట్ నెక్ టీస్ ధరించి కొంచెం పొడవాటి జుట్టుతో అల్ట్రా మోడ్రన్ గా కనిపించారు మహేష్. ఈ రూపం దేనికోసం అంటే.. ఒక వాణిజ్య ప్రకటన కోసం ఇలా రెడీ అయ్యారట. ఇటీవలే ఈ గెటప్ తో షూట్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ఇక సర్కార్ వారి పాట జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. కీర్తి సురేష్ ఇందులో కథానాయిక. ఆగస్టు 2021 నాటికి విడుదలకు సిద్ధం చేస్తారు. ఇవే కాకుండా, .. త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఎస్.ఎస్.రాజమౌళి.. కొరటాల శివలతో మహేష్ సినిమాలు చేయనున్నారు.