Begin typing your search above and press return to search.

SSMB28.. కీ రోల్స్ ఫైన‌ల్ అయిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   4 Jan 2023 10:30 AM
SSMB28.. కీ రోల్స్ ఫైన‌ల్ అయిన‌ట్టేనా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ ల క‌ల‌యిక‌లో పుష్క కాలం త‌రువాత ఓ భారీ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియా మూవీగా తెర‌పైకి రానున్న ఈ ప్రాజెక్ట్ ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యానర్ పై ఎస్‌. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. 'అత‌డు', 'ఖ‌లేజా' వంటి సినిమాల త‌రువాత మ‌హేష్, త్రివిక్ర‌మ్ ల క‌ల‌యిక‌లో రానున్న మూడ‌వ ప్రాజెక్ట్ కావ‌డంతో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమా ప్ర‌క‌టించి నెల‌లు కావ‌స్తోంది. ఇటీవ‌లే యాక్ష‌న్ ఘ‌ట్టాల నేప‌థ్యంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఫ‌స్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. అయితే క‌థ‌లో భారీ మార్పులు చేయ‌డంతో ఆ యాక్ష‌న్ ఎపిసోడ్ ని ప‌క్క‌న‌ పడేసి ఫ్రెష్ గా షూటింగ్ చేయాల‌ని ప్లాన్ మొత్తం మార్చేశారు.

ఇది కూడా ఇంత వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఎప్ప‌టికి ప‌ట్టాలెక్కుతుందో? అని అభిమానులు ఫీల‌వుతున్నారు. ఇదిలా వుంటే జ‌న‌వ‌రి రెండ‌వ వారం నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభం కానుంద‌ని, మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు ఏక‌ధాటిగా 60 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంద‌ని తెలిసింది.

ఇదిలా వుంటే ఈ మూవీలో న‌టించే కీల‌క న‌టీన‌టుల గురించి రోజుకో వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తూ ఆస‌క్తిని రేకెత్తిస్తూనే ఫ్యాన్స్ లో క‌న్ఫ్యూజ‌న్‌ని క్రియేట్ చేస్తోంది. ఇటీవ‌ల మ‌హేష్ మ‌ద‌ర్‌, ఆ త‌రువాత ఫాద‌ర్ సూప‌ర్ స్టార్ కృష్ణ అక‌స్మాత్తుగా మృతి చెంద‌డంతో SSMB28 రెగ్యుల‌ర్‌షూటింగ్ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీలో న‌టించే న‌టీన‌టులు వీళ్లే అంటూ ర‌క ర‌కాల వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. బాలీవుడ్ న‌టుడు బోమ‌న్ ఇరానీ, న‌దియా, ట‌బు, స‌చిన్ ఖేడేక‌ర్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తారంటూ ఓ వార్త వినిపించింది.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కీ రోల్స్ కోసం ఫైన‌ల్ అయిన న‌టీన‌టులు మాత్రం వీళ్లే. త్రివిక్ర‌మ్ మార్కు ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొంద‌నున్న ఈమూవీలో కీల‌క విల‌న్ గా జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నుండ‌గా, మ‌హేష్ బాబు ఫాద‌ర్ పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ ని ఫైన‌ల్ చేశార‌ట‌. అంతే కాకుండా త్రివిక్ర‌మ్ సినిమాల్లో ఈ మ‌ధ్య ఎక్కువ‌గా క‌నిపిస్తున్న ముర‌ళీశ‌ర్మ ని హీరోయిన్ పూజా హెగ్డే ఫాద‌ర్ గా ఎంపిక చేసుకున్నార‌ని తెలిసింది. మ‌రిన్ని వివ‌రాల‌ని మేక‌ర్స్ త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.