Begin typing your search above and press return to search.
SSMB28.. మహేష్ కెరీర్ లోనే బెస్ట్
By: Tupaki Desk | 1 March 2023 1:30 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు టైటిల్ విషయంలో మరియు స్టోరీ లైన్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి కూడా అందరిలో కనిపిస్తోంది.
మహేష్ బాబు లుక్ విషయంలో అభిమానులు చాలా అంచనాలు పెట్టుకుని ఉన్నారు. అందుకు కారణం గత కొన్నాళ్లుగా సినిమా లోని మహేష్ బాబు లుక్ విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కెరీర్ బెస్ట్ లుక్ లో ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు అంటూ తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఆఫ్ ది రికార్డ్ అన్నారు.
పాత్రకు తగ్గట్లుగా మహేష్ బాబును చాలా క్యాజువల్ దుస్తులతో పాటు విభిన్నమైన హెయిర్ స్టైల్ మరియు గడ్డంతో త్రివిక్రమ్ చూపించే విధంగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మహేష్ బాబు లుక్ ఉంటుందని ఇప్పటికే నిర్మాత నాగ వంశీ పేర్కొన్నాడు.
ఈ సినిమా లో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా శ్రీలీలా కూడా ఈ సినిమా లో కనిపించబోతుంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ భూమి పడ్నేకర్ ను కూడా కీలక పాత్రలో నటింపజేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సినిమా లో లుక్ మరియు ఇతర విషయాలు మహేష్ బాబు కెరీర్ లోనే ది బెస్ట్ అన్నట్లుగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.