Begin typing your search above and press return to search.

మాయావితో మ‌హేష్ ముహూర్తం..?

By:  Tupaki Desk   |   17 Jan 2022 4:43 AM GMT
మాయావితో మ‌హేష్ ముహూర్తం..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవ‌లే క‌రోనా భారిన ప‌డి చికిత్స‌తో కోలుకుంటున్న సంగ‌తి తెలిసిందే. `స‌ర్కార్ వారి పాట‌` చిత్ర‌బృందంలో ప‌లువురికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో షూటింగ్ వాయిదా ప‌డింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఇదిలా ఉంటే స‌ర్కార్ వారి పాట షెడ్యూల్స్ ని మ‌హేష్ ఎప్ప‌టికి పూర్తి చేస్తారు? త్రివిక్ర‌మ్ తో సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంది? అంటూ అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ని ముగించి మ‌హేష్ స్క్రిప్టుపై దృష్టి సారిస్తున్నార‌ని తెలిసింది. భీమ్లానాయ‌క్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆల్మోస్ట్ చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. ప్ర‌స్తుతం మ‌హేష్ షూటింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారు. తమన్ తో మ్యూజిక్‌ సెషన్స్ జరుగుతున్నాయి. కరోనావైరస్ నుండి కోలుకున్న తర్వాత థమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో చేరాడు. పనులు సవ్యంగా సాగితే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి షూటింగ్‌ ప్రారంభం కానుంది.

మహేష్ బాబు సర్కార్ వారి పాట షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ నుండి త్రివిక్రమ్ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతార‌ని తెలిసింది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాకి కాస్టింగ్ ఎంపిక‌లు సాగుతున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.