Begin typing your search above and press return to search.
మహేష్ సినిమా.. థమన్ రేటెంత?
By: Tupaki Desk | 27 Sep 2022 12:30 AM GMTటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా ఎక్కువ సినిమాలతో బిజీగా ఉన్నా సంగీత దర్శకులలో థమన్ ఒకరు. అతని కంటే ముందు దేవిశ్రీప్రసాద్ నాన్ స్టాప్ సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఎక్కువ స్థాయిలో థమన్ ఆఫర్లు అందుకుంటున్నాడు. ఆఖరికి దేవిశ్రీప్రసాద్ తో వర్క్ చేసిన ఇంతకుముందు దర్శకులు కూడా థమన్ తోనే సినిమాలు చేస్తూ ఉండడం విశేషం.
థమన్ కాపీ ఆరోపణలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మళ్లీ ఏదో ఒక విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ చేతిలో పడ్డప్పటి నుంచి థమన్ సౌండ్ మొత్తం మారిపోయింది అనే చెప్పాలి. కేవలం మ్యూజిక్ పరంగానే కాకుండా థమన్ ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతే కాకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో కూడా అతడు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తున్నాడు.
ఏరి కోరి మరి కొంతమంది హీరోలు థమన్ ను ప్రత్యేకంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేయాలి అని సెలెక్ట్ చేస్తున్నారు. ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసిన సినిమాలకు చివరి నిమిషంలో కూడా థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ తరుణంలో మహేష్ బాబు SSMB 28 సినిమా థమన్ కు కెరీర్ లోనే చాలా పెద్ద ప్రాజెక్టు అని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కోసం ప్రధాన టెక్నీషియన్స్ అందరికీ ఇప్పుడు భారీ స్థాయిలోనే పారితోషకాలు వస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ పాట్నార్ గా ఉన్నాడు కాబట్టి అతనికి దాదాపుగా 60 కోట్లకు పైగానే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఇక మహేష్ బాబు కూడా 75 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.
ఇక థమన్ మ్యూజిక్ పరంగా ఇంతకుముందు ప్రతి సినిమాకు రెండు కోట్ల వరకు అందుకుంటూ వచ్చాడు. ఇక SSMB28 సినిమాకు మాత్రం నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఆడియో రైట్స్ ద్వారానే ఈ సినిమా ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉంది. మరి అందులో కూడా షేర్ అందుకుంటాడో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.