Begin typing your search above and press return to search.

SSMB28 రిలీజ్ డేట్ ఓకే.. స్టార్టింగ్ ఎప్పుడో?

By:  Tupaki Desk   |   18 Aug 2022 12:33 PM GMT
SSMB28 రిలీజ్ డేట్ ఓకే.. స్టార్టింగ్ ఎప్పుడో?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ దాదాపు 12 ఏళ్ల విరామం త‌రువాత క‌లిసి సినిమా చేయ‌బోతున్నారు. SSMB28 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌పైకి రానున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎస్‌. రాధాకృష్ణ నిర్మించ‌బోతున్నారు. `ఖ‌లేజా` తువాత త్ర‌విక్ర‌మ్‌, మ‌హేష్ ల క‌ల‌యిక‌లో రానున్న సినిమా కావ‌డంతో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌త్యేకంగా చూస్తున్నారు.

బాసీవ్ ఎపిక్ బ్లాస్ట్ అంటూ మేక‌ర్స్ ప్ర‌చారం చేస్తున్న ఈ మూవీలో మ‌హేష్ కు జోడీగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టించ‌బోతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి దాదాపు రెండు నెల‌లు కావ‌స్తోంది. ఎప్పెడెప్పుడు ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుందా? అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంత‌కూ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌క‌పోవ‌డం, షూటింగ్ కి సంబంధించిన అప్ డేట్ రావ‌డం లేదంటూ ఫ్యాన్స్ మేక‌ర్స్ పై సోష‌ల్ మీడియా వేదిక‌గా గ‌త కొన్ని రోజులుగా విరుచుకుప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో యంగ్ ప్రొడ్యూస‌ర్, సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ మూవీ నుంచి ఎగ్జైటింగ్ అప్ డేట్ డేట్ వ‌చ్చేస్తోందంటూ గురువారం ఉద‌యం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు. అన్న‌ట్టుగానే ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ ఓ వీడియోని విడుద‌ల చేశారు. SSMB28ని 2023 ఏప్రిల్ 28న విడుద‌ల చేస్తున్నామంటూ ప్ర‌క‌టించి ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేశారు.

అంతా బాగానే వుంది. షూటింగే స్టార్ట్ కాలేదు అప్పుడే రిలీజ్ డేటా? అంటూ కొంత మంది దీనిపై కామెంట్ లు చేస్తున్నారు. అంతా బాగానే వుంది గానీ షూటింగ్ ఎప్పుడు మొద‌లు పెడుతున్నారో అది కూడా చెప్పండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే నెల సెప్టెంబ‌ర్ 10 తరువాత నుంచి ప్రారంభం అయ్యే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. కానీ దీనిపై మేక‌ర్స్ నుంచి మాత్రం ఎలాంటి అఫీషియ‌ల్ అప్ డేట్ లేదు.