Begin typing your search above and press return to search.
ఈ దర్శకుడికి కాస్త వెటకారం కూడా ఎక్కువే: రాజమౌళి
By: Tupaki Desk | 29 Jun 2022 2:32 PM GMTఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ లను తెరపైకి తీసుకు రావడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. కంటెంట్ నచ్చితే చాలు .. బడ్జెట్ గురించి ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఈ తరహా సినిమాలు హిట్ అయితే వచ్చే లాభాలు కూడా కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్లనే చిన్న పాయింటు పట్టుకుని మేకర్స్ రెడీ అవుతున్నారు. అలా 'మత్తువదలరా' సినిమా తరువాత రితేశ్ రాణా దర్శకత్వం వహించిన 'హ్యాపీ బర్త్ డే' విడుదలకి రెడీ అవుతోంది.
మైత్రీ వారు నిర్మించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. లావణ్య త్రిపాఠి ప్రధానమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో వెన్నెల కిశోర్ .. రాహుల్ రామకృష్ణ .. సత్య .. గుండు సుదర్శన్ తదితరులు కనిపించనున్నారు. జులై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ముఖ్య అతిథిగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ .. "ముందుగా ఈ సినిమా నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ట్రైలర్ చూస్తేనే సినిమా బ్లాక్ బస్టర్ అనిపిస్తోంది.
రితేశ్ రాణాకీ తనపై .. తన కథలపై చాలా నమ్మకం ఎక్కువ అనే విషయం అర్థమవుతోంది .. అలాగే కొంచెం వెటకారం కూడా ఎక్కువనే విషయం అర్థమవుతోంది. 'పాన్ తెలుగు ఫిల్మ్' అనేది చూడగానే నాకు చాలా నవ్వొచ్చింది.
నా మీద కూడా జోక్ వేశాడేమోనని అనుమానంగా ఉంది. అన్ని భాషల్లోను పాన్ తెలుగు సినిమా అని రాయించేసరికి నాకు డౌటు వచ్చింది. కానీ వాళ్ల ప్రొడ్యూసర్ మూడు నిమిషాలు మాట్లాడాడుగానీ ఒక్క ముక్క కూడా తెలుగు మాట్లాడలేదు. ఇలాంటి సినిమాలు హీరోయిన్స్ కి చాలా అరుదుగా దొరుకుతుంటాయి. అలాంటి ఛాన్స్ లావణ్య కొట్టేసింది.
ఇప్పుడున్న కమెడియన్స్ లో నాకు బాగా ఇష్టమైనది వెన్నెల కిశోర్ అండ్ సత్య. టీజర్ లోను .. ట్రైలర్ లోను కామెడీ బాగా చేశారు. రితేశ్ ఎవరితోనైనా కామెడీ బాగా చేయించుకోగలడు. నిజానికి థ్రిల్లర్ ను .. కామెడీని కలిపి నడిపించడం చాలా కష్టం.
ఆ పనిని రితేశ్ చాలా సక్సెస్ ఫుల్ గా చేశాడు. ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్స్ కి ఎక్కువగా రావడం లేదు. నాకు తెలిసి కంటెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే .. చెప్పదలచుకున్నది ఫుల్త ఫ్లెడ్జ్ గా చెప్పేస్తే తప్పకుండా వస్తారని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.