Begin typing your search above and press return to search.
వేదికపై కన్నీళ్లు పెట్టించిన రైతన్న
By: Tupaki Desk | 12 May 2019 11:48 AM GMTభుజంపై నాగలి.. మాసిన గడ్డం.. తలకట్టు .. రైతు అంటే ఇలానే ఉంటాడా? అన్నంతగా ఆ ముసలి రైతును తీర్చిదిద్దారు మహర్షి చిత్రంలో. ఇంతకీ ఆయనెవరు? ఇంతకుముందెప్పుడూ ఆ ముసలాయన్ని ఫిలింనగర్ లో కానీ.. సినిమాల్లో కానీ చూడలేదు అంటూ మాట్లాడుకున్నారు. అచ్చు గుద్దినట్టు రైతుగా నటించాడు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన ఒక రైతు కూలీ కొడుకు. గురుస్వామి ఆయన పేరు. కర్నూల్ జిల్లాకి చెందిన స్టేజీ ఆర్టిస్ట్.
``ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు. మరి రైతు ఏడిస్తే దేశానికి ఏం మంచి జరుగుతుందయ్యా.. ఇక్కడే పుట్టా.. ఈ మట్టిలోనే చస్తా.. ఎవడైనా ఈ పొలం నాదని వస్తే ఊరుకోను`` అంటూ ఆయన పలికించిన హావభావాల్ని ఆడియెన్ మర్చిపోలేరు. థియేటర్లలో కళ్లు చెమర్చే సీన్లకు ఆయన ప్రాణం పోసారు. అయితే ఆయన అంతగా నటించగలగడానికి కారణం తనో స్టేజ్ ఆర్టిస్ట్. అంతకు మించి పొలం పండించిన రైతు. తాజాగా ఆయన మహర్షి ప్రచార వేడుకలో మీడియాకి చిక్కారు.
ఇక ఆయన స్టేజీ ఆర్టిస్టు అయినా ఇలా సినిమావాళ్ల వేడుకల్లో మాట్లాడిందేం లేదు. తొలిసారి స్టేజ్‌పై మాట్లాడిన గురుస్వామి కళ్లు చెమర్చే ప్రసంగంతో మైమరిపించారు. ఆయన స్పీచ్‌కి దర్శకుడు వంశీపైడిపల్లి కన్నీటిపర్యంతం అవ్వగా.. ఎమోషన్ అయిన మహేష్ గరుస్వామిని ఆలింగనం చేసుకున్నారు. గురుస్వామి మాట్లాడుతూ ``నేను ఓ కూలీ కొడుకుని. మా నాన్న కష్టపడి చదివిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగలిగా. మాది చాలా పెద్ద కుటుంబం. ఆర్ధిక ఇబ్బందులను మరిచిపోవడానికి యాక్టింగ్ వైపుమళ్లాను. కర్నూల్‌లో స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఉన్నాను. షార్ట్ ఫిలింస్ లో నటిస్తున్నా. అలా నాతో ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్‌లో నన్ను చూసి దర్శకుడు వంశీపైడిపల్లి నన్ను పిలిచి అవకాశం ఇచ్చారు`` అని చెప్పారు. తప్పటడుగులు వేస్తున్న పిల్లివాడిని ఎలా చేయిపట్టుకుని నడిపిస్తారో.. మహర్షి సినిమాలో నన్ను అలా నడిపించారు. నేను ఊహించని ప్రపంచంలోకి వచ్చాను. ఈ జీవితం ధన్యం అయ్యింది. నా నట జీవితానికి గుర్తింపు వచ్చేట్టు చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్ర యూనిట్‌కి జీవితాంతం రుణ పడి ఉంటాను. నాకు కెమెరా అంటే తెలియదు. సినిమాలు ఎలా చేస్తారో తెలియదు. ఎలా నిలబడాలో.. ఏం చేయాలో తెలియదు. రవి అనే ఆయన నా చేయిపట్టుకుని మీరు ఇలా నటించాలి.. ఇలా చూడాలి అని చెప్పారు... అంటూ అద్భుతమైన స్పీచ్ ని ఇచ్చారు. మహేష్ బాబు గురించి పిల్లలు చెప్పుకునే వారు. ఆయన పెద్ద నటుడు అని. అలాంటిది ఆయనతో నేను నటించడం ఏంటి? ఆయన పక్కన నిలబడటానికే అర్హత లేదనేవారు. అలాంటి ఈ జీవితాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు గురుస్వామి. వేదికపై అందరూ లేచి నిలబడడమే కాదు ఎంతో ఎమోషన్ అయ్యారు. మహేష్ ఆయనకు చేతులెత్తి గురుస్వామికి నమస్కరించి గుండెలకు హత్తుకున్నారు. మొత్తానికి వేదికపైనా రైతు ఎపిసోడ్ ని అలా అద్భుతంగా రక్తి కట్టించింది మహర్షి టీమ్.