Begin typing your search above and press return to search.

సంక్రాంతి పోటీపై స్టాలిన్‌ ఆసక్తికర కామెంట్స్‌

By:  Tupaki Desk   |   9 Nov 2022 6:31 AM GMT
సంక్రాంతి పోటీపై స్టాలిన్‌ ఆసక్తికర కామెంట్స్‌
X
టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి లు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలతో పాటు తమిళంతో పాటు తెలుగు లో రూపొందుతున్న వారసుడు సినిమాను కూడా సంక్రాంతి బరిలో ఉంచబోతున్నారు.

దిల్‌ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో సాధ్యం అయినంత ఎక్కువ థియేటర్లు లభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ తమిళనాట మాత్రం వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్లు సంక్రాంతికి విడుదల చేస్తే దక్కే అవకాశం లేదు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అందుకు కారణం అదే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అజిత్‌ కుమార్ నటించిన తునివు ని ఉదయనిధి స్టాలిన్ రిలీజ్ చేయబోతున్నాడు. ఆయన ముఖ్య మంత్రి కొడుకు అవ్వడంతో పాటు ఇండస్ట్రీలో ముఖ్యంగా తమిళనాడు వ్యాప్తంగా థియేటర్ల వద్ద పట్టు ఉంది. కనుక ఆయన సాధ్యం అయినంత ఎక్కువగా తునివు సినిమాకే ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

ఈ సమయంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ అంతా అనుకుంటున్నట్లుగా తునివు సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ ను ఇవ్వలేము అన్నాడు. వారసుడు సినిమాకు కూడా న్యాయం జరిగే విధంగా తునివు మరియు వారసుడు సినిమాలకు సమానంగా స్క్రీన్స్ ను సంక్రాంతి సందర్భగా ఇవ్వబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

వాలిమై సినిమా విడుదల చేసిన సమయంలో మొత్తం థియేటర్లను ఆక్రమించలేదు అన్నట్లుగా ఆయన గుర్తు చేశాడు. ఈ సంక్రాంతి పోరు లో ఇద్దరు హీరోలకు సమానమైన అవకాశం కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఉదయనిధి స్టాలిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తమిళనాడు తో పాటు ఈ రెండు సినిమా లు తెలుగు లో కూడా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.