Begin typing your search above and press return to search.
'పుష్ప' కు వర్కౌట్ అయింది.. 'లైగర్' కు మైనస్ అయింది..!
By: Tupaki Desk | 27 Aug 2022 9:30 AM GMTఎన్నో అంచనాల మధ్య ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ''లైగర్'' మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాథ్ కలిసి చేసిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ.. ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. మౌత్ టాక్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రెండో రోజు నుంచి అన్ని ఏరియాల్లో డ్రాప్స్ కనిపించాయి. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా అద్భుతాలు చేస్తుందని అనుకోలేమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
'లైగర్' సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే.. అసలు ఇలాంటి స్టోరీని విజయ్ ఎలా యాక్సెప్ట్ చేశారు?.. ఇలాంటి పేలవమైన కంటెంట్ తో పాన్ ఇండియాని ఏ విధంగా షేక్ చేయాలని అనుకున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ఇన్స్పిరేషన్ గా పూరీ జగన్నాథ్ చెప్పిన బ్యాక్ స్టోరీని గుర్తు చేసుకుంటున్నారు.
'లైగర్' పుట్టడానికి అసలు కారణం అల్లు అర్జున్ అని పూరీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఇద్దరమ్మాయిలతో..' చిత్ర షూటింగ్ సమయంలో ఈ సినిమాకు బీజం పడిందన్నారు. 'హాలీవుడ్ లో ఒక డైరెక్టర్ ప్రతీ సినిమాలో హీరోకి ఒక లోపం పెడతాడు. మీరెందుకు అలాంటి కథలు రాయడం లేదు' అని బన్నీ అన్నాడని చెప్పాడు. హీరోకు 'నత్తి' పెడితే ఎలా ఉంటుందని అడగ్గా.. బాగుంటుందని బన్నీ బదులిచ్చినట్టు తెలిపారు. ఈ విధంగా 'లైగర్' కథ రాయడానికి అల్లు అర్జున్ కారణమయ్యారన్నమాట.
ఇకపోతే 'లైగర్' మూవీ క్లైమాక్స్ పై ఆడియన్స్ నుంచి నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ పూర్తిగా నిరాశ పరిచినట్లు చెబుతున్నారు. అయితే పూరీ జగన్నాథ్ ఈ బ్లాక్ రాసుకోడానికి 'పుష్ప' క్లైమాక్స్ కారణమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
'లైగర్' ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల దర్శకులు సుకుమార్ మరియు పూరీ జగన్నాథ్ లతో ఇంటర్వ్యూ రికార్డ్ చేసి వదిలారు మేకర్స్. ఈ సందర్భంగా సుక్కూ రూపొందించిన 'పుష్ప' క్లైమాక్స్ ఈ సినిమాలో క్లైమాక్స్ రాయడానికి తనను ఇన్స్పైర్ చేసిందని పూరి చెప్పారు. కానీ సినిమా చూసిన తర్వాత, పూరి అసలు పుష్ప క్లైమాక్స్ నుండి ఏమి ప్రేరణ పొందాడు.. ఇలాంటి క్లైమాక్స్ తో ఎలా వచ్చాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
'పుష్ప: ది రైజ్' లో అల్లు అర్జున్ మరియు ఫహద్ ఫాజిల్ పాత్రలను సినిమా క్లైమాక్స్ లో బాగా ఎస్టాబ్లిష్ చేశాడు సుకుమార్. హీరో - విలన్ల మధ్య ఎలాంటి ఫైట్ లేకుండా వారి క్యారెక్టరైజేషన్స్ ఎలివేట్ చేసారు. నిజానికి ఈ బ్లాక్ కి మొదట్లో ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. రెండు భాగాలుగా చేయాలనే ఆలోచనలో.. పుష్ప-2 పరిచయం కోసం ఈ విధంగా ఎండ్ చేశారని అర్థమైంది. అందుకే జనాలు తర్వాత రోజుల్లో బాగానే యాక్సెప్ట్ చేశారు.
ఇక్కడ 'లైగర్' విషయానికి వస్తే, మైక్ టైసన్ మరియు విజయ్ దేవరకొండ లపై చిత్రీకరించిన క్లైమాక్స్ పూర్తిగా నిరాశ పరిచింది. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ ను ఇండియన్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చిన పూరీ.. అతనికి తగిన పాత్రను రాసుకోలేదు. ఒక కామెడీ విలన్ గా జోకర్ గా మైక్ ను ప్రెజెంట్ చేశారు. అందుకే క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు.
మూవీ ప్రమోషన్స్ లో మైక్ టైసన్ ఎపిసోడ్ గురించి 'లైగర్' టీమ్ గొప్పగా చెబుతూ వచ్చారు. దీంతో మైక్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని ఊహించుకుంటే.. క్లైమాక్స్ లో ఉసూరుమనిపించేశారు. కామెడీకి యాక్షన్ కు మధ్యలో ఎటూకాకుండా చూపించారు. ఇది సినిమాకు మైనస్ గా మారిందని అంటున్నారు. ఈ క్లైమాక్స్ రాయడానికి పూరికి 'పుష్ప' క్లైమాక్స్ ప్రేరణ అయితే.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో స్టార్ డైరెక్టర్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి.
ఎలా అయితేనేం 'లైగర్' కథ పుట్టడానికి అల్లు అర్జున్ ఐడియా కారణమైతే.. క్లైమాక్స్ పార్ట్ రాసుకోడానికి ఆయన హీరోగా నటించిన 'పుష్ప' సినిమా కారణమైంది. కాకపోతే దాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా పూరీ జగన్నాధ్ రాసుకోలేకపోయాడు.. ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్ చేయలేకపోయారని చెప్పాలి.