Begin typing your search above and press return to search.
`స్టాండప్ రాహుల్` : నీ నిర్ణయాలే నీ ఫ్యూచర్
By: Tupaki Desk | 4 March 2022 12:17 PM GMTవిభిన్నమైన చిత్రాలతో హీరోగా మంచి పేరుతో పాటు ప్రత్యేతని చాటుకున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. `ఒరేయ్ బుజ్జిగా` చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాజ్ తరుణ్ తాజాగా చేస్తున్న సరికొత్త ప్రయత్నం `స్టాండప్ రాహుల్`. స్టాండప్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ జానర్ మన టాలీవుడ్ కు కొత్త కావడంతో సినిమా ఎలా వుంటుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాంటో డైరెక్ట్ చేస్తున్నారు.
డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై నంద్ కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు. ఇంద్రజ, మురళీశర్మ, దర్శకుడు వెంకటేష్ మహా, వెన్నెల కిషోర్, దేవి ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేస్తూ ఈ మూవీ రిలీజ్ డేట్ ని చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. `మా బాస్ ఏపనైనా రెండే రెండు నిమిషాల్లో చేస్తాడు.. వాళ్ల వైఫ్ గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధేస్తుంది` అంటూ రాజ్ తరుణ్ డైలాగ్ లలో ట్రైలర్ మొదలైంది.
పేరు రాహుల్.. వెటకారం ఎక్కువ.. ఏడాదికి మూడు ఉద్యోగాలు చేస్తూ ఎందులోనూ నిలకడగా వుండకపోవడం రాహుల్ ప్రత్యేకత. అలాంటి రాహుల్ కి డ్రీమర్ అయిన శ్రేయ పరిచయం అవుతుంది. కలల్ని నిజం చేసుకోవాలన్నది శ్రేయ ఆలోచన. ఈ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది? .. మధ్యలో ఈ జంటకు వెన్నెల కిషోర్ కలిగించే అడ్డంకులు ఏంటీ? దానికి రాజ్ తరుణ్ రియాక్షన్ ఎలా వుంటుంది? .. లైఫ్ లో సెటిల్ కావడం మీ బ్లడ్ లోనే లేదని తల్లి పాత్రలో నటించిన ఇంద్రజ ఎందుకు రాహుల్ ని తిడుతోంది?.. నీ నిర్ణయాలే నీ ఫ్యూచర్ అని వర్ష ఎందుకు చెబుతోంది. అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్టాండప్ కామెడీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. కొత్త తరహా కథతో వస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకర్ అగస్తి సంగీతం అందించారు. ఫొటోగ్రఫీ శ్రీరజ్ రవీంద్రన్, మాటలు నందకిషోర్ ఈమని, ఎడిటింగ్ రవితేజ గిరిజాల.