Begin typing your search above and press return to search.

స్టార్ యాక్టర్ డాటర్.. గ్లామర్ తో చంపేస్తోందిగా..

By:  Tupaki Desk   |   14 Dec 2022 10:30 AM GMT
స్టార్ యాక్టర్ డాటర్.. గ్లామర్ తో చంపేస్తోందిగా..
X
బ్యూటిఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పడు నుంచి కూడా ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త తరహా గ్లామర్ తో మెప్పించే ప్రయత్నం చేస్తుంది. మొదట్లోనే బ్యాక్ గ్రౌండ్ తో అవకాశాలు అందుకుంది అని ఆమె హీరోయిన్ మెటీరియల్ కాదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె మొదట కేదార్నాథ్ అనే సినిమాలో నటించింది.

ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ అందులో నటనకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఆమె స్టార్ హీరోయిన్ అయ్యే రేంజ్ లో అయితే క్లిక్ అవ్వదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అంతేకాకుండా గ్లామర్ విషయంలో కూడా కొంత ట్రోల్ అయితే నడిచింది. కానీ ఆ విమర్శలను దాటి అమ్మడు తన ప్రతి సినిమాలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

ఇక గ్లామర్ విషయంలో అయితే నేటితరం స్టార్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా ముందుకు సాగుతోంది. ఇక ఇటీవల సారా అలీ ఖాన్ ఊహించని గ్లామర్ తో మరోసారి మెప్పించే ప్రయత్నం చేసింది. ఫ్యాషన్ దుస్తులలో అమ్మడు మెరిసే లెగ్స్ ఉండాలతో ఊహించిన విధంగా కనిపించింది. గతంలో బికినీలో కూడా కనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం మరింత అందంగా ఉంది అని ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో అయితే సారా అలీ ఖాన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఇన్స్టాగ్రామ్ నటిమణులలో ఈ బ్యూటీ కూడా టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. కేవలం ఏడాదిలోనే అమ్మడు 10 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం విశేషం. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సారా అలీ ఖాన్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ తో పాటు స్టార్ హీరో సినిమాలో కూడా నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.