Begin typing your search above and press return to search.

పాప పుట్టాక మీకు పెళ్లైందా? అని అడిగేవారు.. ఇంద్రజ నోట తాజా మాట

By:  Tupaki Desk   |   16 Aug 2022 1:30 AM GMT
పాప పుట్టాక మీకు పెళ్లైందా? అని అడిగేవారు.. ఇంద్రజ నోట తాజా మాట
X
అందం.. అభినయం.. అన్ని ఉన్న హీరోయిన్లు తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలోనూ సక్సెస్ ఫుల్ గా సినిమా ఇండస్ట్రీలో రాణించేవారు తక్కువగా ఉంటారు. అయితే.. సక్సెస్ వచ్చిన తర్వాత గ్లామర్ మరింత ఒలకబోస్తూ ఇండస్ట్రీలో కంటిన్యూ చేసే కన్నా.. పర్సనల్ లైఫ్ కోసం కెరీర్ కు కామా పెట్టి.. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసే నటీమణులు తక్కువగా ఉంటారు.

ఆ కోవలోకే వస్తారు సీనియర్ నటి ఇంద్రజ. ఇప్పటికి వయసు మీద పడినట్లుగా కనిపించని ఈ సీనియర్ నటి వ్యక్తిగత జీవితం రీల్ కు మించినన్ని మలుపులు కనిపిస్తాయి.

తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలు.. తన మ్యారేజ్ కు సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. గతంలో తన వ్యక్తిగత విషయాలు చెప్పినా.. ఇంత వివరంగా మాత్రం చెప్పింది లేదు. ఇంద్రజ చేసుకున్నది బిజినెస్ మ్యాన్ ను కాదు.. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. అలా అని పూర్తిస్థాయి ఇండస్ట్రీ వ్యక్తి కాదు. తమిళంలో తన భర్త అప్పట్లోకొన్ని సీరియళ్లు చేశారని.. యాడ్ ఫిలింస్ కూడా చేసినట్లు ఇంద్రజ చెప్పారు. రచయిత కూడా అయిన ఆయన.. మామయ్య బిజినెస్ చేసుకుంటూ సినిమా రంగానికి సంబంధించిన పనులు చూసుకునే వాడన్నారు.

తమది లవ్ మ్యారేజ్ అని.. గుట్టుగా.. సింఫుల్ గా పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. రిజిస్టర్ మార్యేజ్ చేసుకొని 13 మందితో కలిసి హోటల్ కు వెళ్లి బోజనం చేసి ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పారు. ‘రిసెప్షన్ కూడా చేయలేదు. హనీమూన్ కు వెళ్లలేదు. పాప పుట్టిన తర్వాత మీ అమ్మాయా? అని అడిగేవారు.

మీకు పెళ్లైందా? అని చాలామంది అడిగారు. ఇప్పుడు మా అమ్మాయి వయసు పద్నాలుగేళ్లు. పెళ్లి తర్వాత నటనకు ఆయన అభ్యంతరం చెప్పలేదు కానీ.. నాకే సినిమాలు వద్దనిపించింది. నన్ను నేను ఫ్రూవ్ చేసుకోవటానికే ఆ మార్గాన్ని ఎంచుకున్నా’ అని పాత విషయాల్ని చెప్పుకొచ్చారు.

పెళ్లి సమయంలో కాబోయే భర్తకు ఇంద్రజ రెండు కండీషన్లు పెట్టిందని.. అందుకు ఒప్పుకున్న తర్వాతే పెళ్లికి ఓకే చెప్పినట్లు చెబుతారన్న మాటకు స్పందించిన ఆమె.. ‘నిజమే.. కానీ అవి షరతులు కావు. ప్రేమకు అంగీకారం చెప్పటమే. నాకున్న బాధ్యతలు చెప్పానంతే. అమ్మానాన్నలు నాతోనే ఉంటారని చెప్పా. వాళ్లను వదిలి రాలేనని చెప్పా. వాళ్ల బాగోగులు నేను చూసుకుంటానని చెప్పా. మా నాన్న మమ్మల్ని బాగా పెంచారు.చెల్లెళ్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పా. అందుకు ఆయన సరేనన్నారు. నేను పెళ్లికి ఓకే చెప్పాను’ అంటూ అప్పటి సంగతుల్ని కొత్తగా చెప్పుకొచ్చారు.