Begin typing your search above and press return to search.

ఆ రోజు స్నేహితుల నుంచి ఫోన్ లు రావ‌ట‌!

By:  Tupaki Desk   |   27 Sep 2022 10:32 AM GMT
ఆ రోజు స్నేహితుల నుంచి ఫోన్ లు రావ‌ట‌!
X
ప్ర‌తీ శుక్ర‌వారం జాత‌కాలు మారే ఇంస్ట్రీ ఇది. ఎప్పుడు ఎవ‌రి జాతాకాలు తారుమారవుతాయో.. ఎవ‌రిని అదృష్టం త‌లుపు త‌డుతుందో రాత్రికి రాత్రే స్టార్ గా మారుస్తుందో చెప్ప‌డం క‌ష్టం. అవ‌కాశాల కోసం ఏళ్ల త‌ర‌బ‌డి తిరిగిన వాళ్లు ఉన్న‌ట్టుండి స్టార్ డ‌మ్ ని ద‌క్కించుకోవ‌చ్చు.. స్టార్ లుగా వున్న వాళ్లు వ‌రుస డిజాస్ట‌ర్ ల‌ని సొతంం చేసుకుని లైమ్ లైట్ నుంచి తెర‌మ‌రుగైపోవ‌చ్చు. అయితే ఇలాంటి ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాలంటే అన్నింటికి సిద్ధ‌ప‌డాలంటోంది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే.

దువ్వాడ జ‌గన్నాథ‌మ్ సినిమాతో క్రేజీ హీరోయిన్ ల జాబితాలో చేరిన పూజా హెగ్డే ఆ త‌రువాత టాలీవుడ్ లో హాట్ ఫేవ‌రేట్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరో సినిమా అంటే హీరోయిర్ పూజా హెగ్డే వుండాల్సిందే అనేంత‌గా క్రేజ్ ని సొంతం చేసుకుంది. బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు, ప్ర‌భాస్‌, వ‌రుణ్ తేజ్‌, అఖిల్‌.. ఇలా ప్ర‌తీ స్టార్ హీరోగా ఓన్లీ వ‌న్ ఆప్ష‌న్ గా మారి క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోయింది.

ద‌క్షిణాదిలో అగ్ర క‌థానాయిక‌గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న పూజా హెగ్డే త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన 'బీస్ట్‌' మూవీకి అత్యంత భారీ స్థాయిలో పారితోషికాన్ని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచింది.

అయితే ఇటీవ‌ల ప్ర‌భాప్ తో క‌లిసి న‌టించిన 'రాధేశ్యామ్‌', రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి న‌టించిన 'ఆచార్య‌' సినిమాలు డిజాస్ట‌ర్ లు గా మార‌డంతో ఈ అమ్మ‌డి జోరు కాస్త త‌గ్గింది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు తో ఓ మూవీలో న‌టిస్తోంది. బాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తోంది.

ఇదిలా వుంటే హిట్ ఫ్లాపుల‌పై పూజా హెగ్డే మాట్లిడిన తీరు ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటోంది. 'నా అదృష్టం కొద్దీ చిత్ర సీమ‌లోకి అడుగుపెట్టాను. ఇక్క‌డ నా ప్ర‌తిభ‌తో నిల‌దొక్కుకున్నాను. హిట్లు, ఫ్లాపులు ఎప్పుడు త‌లుపుత‌డ‌తాయో ఎవ‌రూ చెప్ప‌లేరు. హిట్ ప‌క్కా అనుకున్న సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ కావొచ్చు. ఎలాంటి బ‌జ్ లేని సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌చ్చు..అందుకే ఇక్క‌డ దేనికైనా సిద్ధంగా వుండాలి. సినిమా హిట్ట‌యితేనే జ‌నం మ‌న గురించి మాట్లాడుకుంటారు. లేదంటే అస్స‌లు ప‌ట్టించుకోరు.

ఆ రోజు క‌నీసం స్నేహితుల నుంచి కూడా ఫోన్లు రావు. ప‌రిశ్ర‌మ సంగ‌తి ఇంతే. హిట్టుప‌డితే ఫోన్ రింగ‌వుతూనే వుంటుంది. అంద‌రికీ ఇలాగే జ‌రుగుతుంది ఈ విష‌యంలో నేనేమీ మిన‌హాయింపు కాదు. ఇక్క‌డ హిట్టుకే విలువ ఎక్కువ‌. ఆ నిజం నాకు త్వ‌ర‌గానే అర్థ‌మైంది. అందుకు నా సినిమా రిలీజ్ అంటే కాస్త కంగారుప‌డుతుంటాను. అయితే ఆ రోజు నా ఫోన్ మోగిందంటే జాతం బాగుద‌న్న‌ట్టే.. లేదంటే ఆ ప‌రిస్థితిని వివ‌రించ‌డం క‌ష్టం' అని చెప్పుకొచ్చింది బుట్ట‌బొమ్మ‌


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.