Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా ద్వారా శుభవార్త తెలిపిన స్టార్ యాంకర్!

By:  Tupaki Desk   |   6 April 2021 9:54 AM GMT
సోషల్ మీడియా ద్వారా శుభవార్త తెలిపిన స్టార్ యాంకర్!
X
తెలుగు టీవీ సీరియల్ యాక్ట్రెస్ కం టీవీ యాంకర్ హరితేజ.. ఇటీవలే తన అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇంతకాలం ఓ వైపు లాక్డౌన్ మరోవైపు ప్రెగ్నెన్సీ కారణంగా ఇండస్ట్రీకి సినిమాలకు దూరంగా ఉంటుంది. నిజానికి సీరియల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన హరితేజ.. మెల్లగా తనలోని యాంకరింగ్ టాలెంట్ బయటపెట్టి ఎన్నో టీవీ ప్రోగ్రాంస్ చేసింది. ఆ తర్వాత మెల్లగా టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యాక సినిమాల్లో అవకాశం సొంతం చేసుకొని వెండతెరపై కూడా మెరిసింది. చాలా సినిమాలు చేసింది కానీ ఆమెకు మంచిపేరు తీసుకొచ్చిన సినిమాలు మాత్రం యూటర్న్, ఫిదా, రాజా ది గ్రేట్, సమ్మోహనం లాంటివి ఉన్నాయి. కానీ సీరియల్స్ పరంగా.. మనసు మమత, రక్తసంబంధం, అభిషేకం లాంటి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

ఇవన్నీ పక్కన పెడితే.. హరితేజ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడంతో అందరి దృష్టిలో పడింది. ఆమె బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారానే మరింత ఎక్కువమందికి పరిచయం అయింది. అయితే ఓవైపు ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తూనే మరోవైపు వ్యక్తిగత జీవితం కూడా హ్యాపీగా లీడ్ చేస్తోంది. లాక్డౌన్ సమయంలో ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు తెలిపిన హరితేజ అప్పుడే ఫోటోషూట్స్ జరిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే తాజాగా హరితేజ దంపతులకు పండంటి ఆడపిల్ల జన్మించింది. ఈ సందర్బంగా ఆనందంతో ఈ శుభవార్తను తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులకు తెలిపింది. ఈ విషయం తెలియడంతో అటు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా హరితేజ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.