Begin typing your search above and press return to search.

తండ్రి మరణంతో స్టార్ యాంకర్ ఎమోషనల్ పోస్ట్..!

By:  Tupaki Desk   |   24 May 2021 6:30 AM GMT
తండ్రి మరణంతో స్టార్ యాంకర్ ఎమోషనల్ పోస్ట్..!
X
టాలీవుడ్ పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. గురించి ప్రత్యేకంగా అటు టీవీ ఇటు సినిమా ప్రేక్షకులకు చెప్పే అవసరం లేదు. పదేళ్లకు పైగా ప్రదీప్ టీవీ - సినీ పరిశ్రమలో కొనసాగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం చిత్రపరిశ్రమతో పాటు దేశం అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రజలు వారి ఆత్మీయులను - కుటుంబాలను కోల్పోతున్నారు. తీరని బాధకు లోనవుతున్నారు. మొన్నటి వరకు మనతో కలిసి ఉన్నటువంటి మనిషి ఒక్కసారిగా కరోనా అనే మహమ్మారి బలి తీసుకోవడంతో మొత్తానికే లోకం విడిచిపోయే పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవలే ప్రదీప్ కూడా కరోనా సోకి హోమ్ క్వారంటైన్ కు వెళ్లాడు.

అయితే ఇటీవలే ప్రదీప్ తన తండ్రి పాండురంగను కోల్పోయాడు. ఏమైందో తెలియదు కానీ ప్రదీప్ తండ్రి మే 1న చనిపోయారు. ఇదివరకు అనారోగ్యంతో బాధపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన కరోనా టైంలో చనిపోయే సరికి అనారోగ్యం కారణంగా చనిపోయారా లేక కరోనాతో చనిపోయారా అనేది తెలియలేదు. అయితే తండ్రి చనిపోయినప్పుటి నుండి ప్రదీప్ పూర్తిగా కుంగిపోయాడు. గతనెల నుండి ప్రదీప్ ఇంటిపట్టునే ఉంటూ కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నాడు. అయితే తండ్రి మరణం పై తాజాగా ప్రదీప్ స్పందించాడు. అలాగే ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సోషల్ మీడియా వేదికగా ప్రదీప్ తన తండ్రిని ఉద్దేశించి ఇలా పేర్కొన్నాడు.

"ఐ లవ్ యు నాన్న. ప్రస్తుతం నేనిలా ఉన్నానంటే దానికి మీరే కారణం మీరే, అలాగే జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా హుందాగా నవ్వుతూ ఎలా ఎదుర్కోవాలో చూపినందుకు మీకు థాంక్యూ. నేనేం చేసినా మీకు గౌరవం కలిగించే పని చేస్తాను. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మంచి చెడు అనేది ఆలోచించకుండా మీరు నా వెన్నంటి నిలిచారు. మీరు ఎంతో ప్రేమతో నిరాశలో ఉన్నప్పుడు నా మనస్సును ఎన్నో సార్లు స్థిరపరిచారు. మీ ధైర్యం నాకు స్ఫూర్తినిచ్చింది. మీ మాటలే నన్ను నిలబడేలా చేసాయి. అంతకుమించిన ప్రేమ లేదు, మీరు నాకు ఎప్పటికీ స్పెషల్. జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉండనివ్వండి. మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ఆపను. మీరు కోరుకున్నట్లుగానే నా జీవితంలో నేను జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తాను. మనం కలిసేదాకా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాను" అంటూ ఎమోషనల్ అయిపోయాడు ప్రదీప్.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రదీప్ యాంకరింగ్ తో పాటు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో డెబ్యూ చేసాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో సెకండ్ మూవీ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రదీప్ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.