Begin typing your search above and press return to search.
నా బాయ్ ఫ్రెండ్ ఫీలవుతాడు.. అలా చేయను: స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్
By: Tupaki Desk | 31 May 2021 11:30 PM GMTదేశంలో ఎప్పుడైతే ఫస్ట్ లాక్డౌన్ ముగిసిందో.. అప్పటినుండి సినిమాలు టీవీ షోలతో బిజీగా ఉండే సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా వారి ప్రేమ - పెళ్లి విషయాలను బయటపెడుతూ సర్ప్రైజులు ఇస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా మెల్లగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. తాజాగా ఓ టీవీ సెలబ్రిటీ పేరు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఆమె ఎవరో కాదు స్టార్ యాంకర్ శ్రీముఖి. మరి ఎందుకు శ్రీముఖి పేరు అంతలా వైరల్ అవుతోంది అంటే.. ఈ యాంకరమ్మ ఇటీవలే ఓ టీవీ షోలో తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. అప్పటినుండి టీవీ యాంకర్ శ్రీముఖి త్వరలో పెళ్లి భోజనం పెట్టనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి శ్రీముఖి మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఇలాంటి సందేహాలు వ్యక్తం అవ్వడం ఖాయం. మరి ఏ టీవీ షోలో.. అసలు ఏం చెప్పింది అంటే.. స్టార్ మా ఛానల్లో 'స్టార్ట్ మ్యూజిక్' అనే కొత్త ఎంటర్టైన్మెంట్ షో వారానికి ఒకసారి ప్రసారం అవుతోంది. యాంకర్ సుమ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షో నుండి కొన్ని వారాల క్రితం జరిగిన ఎపిసోడ్ లో శ్రీముఖి చెప్పేసింది. ఆ షోలో శ్రీముఖితో పాటు విష్ణుప్రియ, హరి, పండు డాన్సర్, ఆర్జే చైతూ, రోల్ రైడాలు కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. అయితే ఈ షో మధ్యలో సుమ - శ్రీముఖి మధ్య జరిగిన సంభాషణలో శ్రీముఖి బాయ్ ఫ్రెండ్ వ్యవహారం బయటపడింది.
షోలో యాంకర్ సుమ మాట్లాడుతూ.. ప్రస్తుతం నీకు స్టేజి మీద కనిపిస్తున్నవారిలో ఎవరంటే అంటే ఇష్టమనే ప్రశ్న వేసింది. అందుకు సమాధానంగా తనకు చిరంజీవి ఒక్కరే ఇష్టమంటూ వెంటనే చెప్పేసింది శ్రీముఖి. అలాగే ఒకవేళ రొమాంటిక్ డేట్‌కి వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళ్తావని సుమ మరో ప్రశ్న అడిగింది. అంతే వెంటనే స్పందించి.. ''ఆల్రెడీ నేను కమిటెడ్.. ఇప్పుడు నేనలా డేటింగ్ కు వెళ్తే నా బాయ్ ఫ్రెండ్ ఫీలవుతాడు. నాకంటూ కొన్ని నియమాలున్నాయి'' అంటూ అందరిముందే షాకింగ్ న్యూస్ చెప్పేసింది శ్రీముఖి. ఆ వార్త విని షోలో ఉన్నవారితో పాటు యాంకర్ సుమ కూడా ఆశ్చర్యపోయింది. అలాగే శ్రీముఖి డాన్సర్ పండుకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 'పండు నువ్వు కొంచెం లిమిట్స్‌లో ఉండు' అంటూ శ్రీముఖి ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో హైలైట్ అయింది. ప్రస్తుతం శ్రీముఖి లవ్ మేటర్ సోషల్ మీడియాలో గురించి ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. అందుకే శ్రీముఖి బాయ్ ఫ్రెండ్ ఎవరా అని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు.