Begin typing your search above and press return to search.
సుమ డిమాండ్ తగ్గినట్లు ఉందే..?
By: Tupaki Desk | 5 Jun 2023 2:30 PM ISTతెలుగులో ప్రస్తుతం స్టార్ యాంకర్స్ అంటే ముందుగా వినిపించే పేరు సుమ. ఈమె ఓ వైపు టీవీషోలు మరోవైపు ప్రీరిలీజ్ ఈవెంట్ లు, ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. మినిమమ్ రేంజ్ సినిమాల నుంచి పాన్ ఇండియా చిత్రాల వరకు అందరికి ఈవెంట్ హోస్ట్ చేయడానికి యాంకర్ సుమనే కావాలి. ఆమె ఉంటే ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవుతుందనే ఫీలింగ్ అందరిలో ఉంది.
సుమ యాంకర్ గా వస్తే ఆమె చలోక్తులతో ఈవెంట్ కి మరింత ఎనర్జీ తీస్తుకోస్తుందని నమ్ముతారు. టాలీవుడ్ స్టార్స్ కూడా సుమ యాంకరింగ్ ఇష్టపడే వారు ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే యాంకరింగ్ లో సుమ కొత్త ఒరవడి సృష్టించారు. ఆమె ఇమేజ్ ని ఇంకెవరూ ప్రస్తుతం అందుకునే స్టేజ్ లో లేరు. కొంతమంది అందాల భామలు యాంకరింగ్ లో సక్సెస్ అవుతున్న సుమని డామినేట్ చేయాలేకపోతున్నారు.
సుమ తర్వాత అంత లీడింగ్ లో ఉన్న యాంకర్ అంటే శ్రీముఖి, ప్రదీప్ అని చెప్పాలి. వీరిద్దరూ టీవీ రియాలిటీ షోల వరకు మాత్రమే పరిమితం అయ్యారు. శ్రీముఖి అయితే సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలు కూడా అప్పుడప్పుడు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సుమ టీవీషోలని చాలా వరకు తగ్గించేసింది. ఆమె వద్దనుకోవడంతో గతంలో సుమ హ్యాండిల్ చేసిన గేమ్ షోలు పూర్తిగా బంద్ అయిపోయాయి.
ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క టీవీషో మాత్రమే ఉంది. అయితే ఈ మధ్య సుమ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగా ఆమెచేసే టీవీషోలు కూడా ఆపేసినట్లు ప్రచారం నడుస్తోంది. అలాగే చిన్న సినిమాలకి, మంజు భార్గవితో పాటు మరికొంత మంది యాంకర్స్ పోటీలో ఉన్నారు. సుమ మాత్రం ఎక్కువగా స్టార్ హీరోల చిత్రాల ప్రీరిలీజ్ లకి పరిమితం అయ్యింది.
గతంలో చిన్న సినిమాలకి కూడా ఆమెని తీసుకునేవారు. అయితే రెమ్యునరేషన్ పెంచేయడంతో అదనపు భారం అవుతుందని సుమ స్థానంలో కొత్త యాంకర్స్ ని ట్రై చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె గతంలో ఉన్నంత స్పీడ్ గా అయితే లేదు. దీనిని బట్టి సుమపై ఈ విధమైన ప్రచారం తెరపైకి వచ్చింది.