Begin typing your search above and press return to search.

ఎవరెడీ బ్యాటరీకి ఎన్ని కష్టాలో..!

By:  Tupaki Desk   |   17 Feb 2019 11:13 AM GMT
ఎవరెడీ బ్యాటరీకి ఎన్ని కష్టాలో..!
X
టాలీవుడ్లో ఉండే హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ లా ఫిట్నెస్ పై ఫోకస్ చేసేవారు మరొకరు లేరు. ఎక్సర్ సైజుల విషయంలో.. డైట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాదట ఈ బ్యూటీ. అంతెందుకు.. తన ఫిట్నెస్ పిచ్చికి తగ్గట్టే 'F 45' జిమ్ ఫ్రాంచైజీని కూడా రన్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఫిట్నెస్ విషయంలో ఇంత పక్కాగా ఉంటుంది కాబట్టే తన ఫ్రెండ్స్ రకుల్ ను ఎవరెడీ బ్యాటరీ తో పోలుస్తారట. అంటే ఎప్పుడైనా ఫుల్ ఛార్జ్ తో ఎనర్జిటిక్ గా ఉంటుందనే కదా. ఈ ఎనర్జీ సంగతేమో గానీ అమ్మడికి తన కెరీర్ లో మాత్రం వరస పరాజయాలు మాత్రం తప్పడం లేదు. పోయినేడాది వరస ఫెయిల్యూర్ లతో ఇబ్బందిపడిన రకుల్ ఈ ఎడాది తనకు బాగా కలసి వస్తుందని ఆశలు పెట్టుకుంటే తన ఫస్ట్ సినిమా 'దేవ్' రిలీజ్ కావడం ఆలస్యం.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఉన్న ఫ్లాప్ టాక్ కు తోడు సినిమాలో తనకు సరిగా సూట్ కాని మేకప్ పై కూడా విమర్శలు వస్తున్నాయి.

ఈ సినిమా తర్వాత సూర్య కొత్త సినిమా 'ఎన్ జీ కే' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఆ సినిమా ఫలితాన్ని బట్టే రకుల్ కు కొత్త అవకాశాలు ఉంటాయనేది కఠిన వాస్తవం. సౌత్ లో పరిస్థితి ఇలా ఉంది కానీ బాలీవుడ్ లో రకుల్ కు రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. 'మర్జావాన్' తో పాటుగా 'దే దే ప్యార్ దే' సినియాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి. మరి అవైనా హిట్ అయ్యి ఈ ఎవరెడీ బ్యాటరీ కెరీర్ ను కాస్త రిఛార్జ్ చేస్తాయా లేదా వేచి చూడాలి.