Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బ‌యోపిక్.. స్టార్స్ తో విందుభోజ‌నం!

By:  Tupaki Desk   |   28 Aug 2018 5:44 AM GMT
ఎన్టీఆర్ బ‌యోపిక్.. స్టార్స్ తో విందుభోజ‌నం!
X
కాలం మారినా.. కొత్త త‌రాలు వ‌స్తున్నా.. తెలుగోడు ఎవ‌రికైనా స‌రే ఎన్టీవోడి త‌ర్వాతే ఎవ‌రైనా. ఆయ‌న ఇమేజ్ ముందు ఇంకెవ‌రూ నిల‌బ‌డ‌లేని ప‌రిస్థితి. అలాంటి ఎన్టీవోడి బ‌యోపిక్ ను బాల‌కృష్ణ ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. ఈ మూవీకి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ ను ఎంపిక చేసుకోవ‌టం ద్వారా.. ఈ ప్రాజెక్టు మీద భారీ ఆశ‌లు పెంచేలా చేస్తోంది.

ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో స్టార్స్ భారీ ఎత్తున ఉండ‌ట‌మే కాదు.. ఇటీవ‌ల కాలంలో ఇంత భారీ తారాగ‌ణంతో మ‌రే సినిమా రూపొందించ‌లేద‌న్న మాట వినిపిస్తోంది.

ఎన్టీఆర్ పాత్ర‌ను బాల‌య్య చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు పాత్ర‌ల‌కు న‌టీన‌టులు ఎంపికైనా.. ఎన్టీఆర్ కుమారుడు.. రాజ‌కీయంగా ఆయ‌న‌కు వెన్నంటి ఉండ‌ట‌మే కాదు.. ఆయ‌న చైత‌న్య‌ర‌థాన్ని న‌డిపిన క్రెడిట్ హ‌రికృష్ణ‌కు ద‌క్కింది. మ‌రి.. రియ‌ల్ హ‌రికృష్ణ పాత్ర‌ను రీల్ లో ఎవ‌రు పోషిస్తున్నార‌న్న ఉత్కంట‌కు చెక్ పెట్ట‌బోతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం హ‌రికృష్ణ రోల్ ను క‌ల్యాణ్ రాం చేయ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. హ‌రికృష్ణ పాత్ర‌కు ఆయ‌న కుమారుడు క‌ల్యాణ్ రాం పోషించ‌టం స‌రిగ్గా సెట్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ భావిస్తున్న‌ట్లు తెలిసిందే.

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో టైటిల్ పాత్ర‌ధారిగా బాల‌య్య చేస్తుండ‌గా.. ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్.. చంద్ర‌బాబు పాత్ర‌ను రానా.. శ్రీ‌దేవి పాత్ర‌ను ర‌కుల్ పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.