Begin typing your search above and press return to search.
కేరళకు స్టార్లు ఎవరెంత ఇచ్చారంటే?
By: Tupaki Desk | 18 Aug 2018 2:30 PM GMTప్రకృతి వైపరీత్యాల వేళ సెలబ్రిటీల స్పందన మెచ్చదగినది. తమని అభిమానించే ప్రజలకు కష్టం వస్తే చూస్తూ ఉండలేరు. ఈ విషయంలో టాలీవుడ్ హీరోలు - కోలీవుడ్ హీరోల ధాతృహృదయాన్ని ప్రశంసించి తీరాలి. పొరుగున ఉన్న కేరళకు వచ్చిన కష్టాన్ని తమదిగా భావించి సాయం చేశారు. అసలు డొనేషన్లు ఎవరు ఎలా ఇచ్చారు? అంటే..
కేరళలోని 14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారో వరద ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయి పెనువిలయం ఊహించనిది. జలవిలయం ముంచుకొచ్చింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. చివరికి ఖరీదైన లొకేషన్లలో ఉండే హీరోల ఇళ్లు వరద ముంపుకు గురై జలదిగ్బందనం అయ్యాయి. ఈ విలయాన్ని చూస్తున్న ఇరుగుపొరుగు వెంటనే ఆదుకునేందుకు ముందుకొచ్చింది. కోలీవుడ్ హీరో విశాల్ నిత్యావసరాల్ని పంపించి సాయం అందిస్తే - సూర్య - కార్తీ 25లక్షల చొప్పున - కమల్ హాసన్ -25లక్షలు - అల్లు అర్జున్ - 25లక్షలు - ప్రభాస్ - కోటి - విజయ్ దేవరకొండ - 5లక్షలు - మమ్ముట్టి- 25లక్షలు - మోహన్ లాల్ -25లక్షలు - ధనుష్ -10లక్షలు - విజయ్ సేతుపతి-15లక్షలు - సిద్ధార్థ్ -10లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేషన్ ఇచ్చారు. నిర్మాత బన్ని వాసు గీత గోవిందం కేరళ వసూళ్లు సీఎం రిలీఫ్ ఫండ్ కే డొనేట్ చేసేస్తున్నారు. మరియు చిరంజీవి - రామ్ చరణ్ చెరొక 25 లక్షలు ఇస్తే చిరంజీవి తల్లి గారు అంజనా దేవి ఒక లక్ష మరియు 10 లక్షల విలువైన మెడికల్ సప్లైస్ సమకూర్చారు.
వీళ్లతో పాటు బాలీవుడ్ స్టార్లు తమవంతుగా స్పందించి సాయమందించారు. రానా - జాన్ అబ్రహాం - సౌందర్య రజనీకాంత్ వంటి సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానుల్ని సాయం కోరారు. సిద్ధార్థ్ - దుల్కార్ సల్మాన్ - నయనతార - సాయిపల్లవి - నివిన్ పాళి వంటి స్టార్లు ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా పిలుపునిచ్చారు. వీలైనంత మంది సెలబ్రిటీలు కేరళకు విరాళాల రూపంలోనో లేక ఏదో ఒక సాయం చేసేందుకు ముందుకు రావడం హర్షణీయం.