Begin typing your search above and press return to search.
డబ్బింగ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ కమెడియన్!
By: Tupaki Desk | 23 Jan 2021 6:00 AM ISTతమిళ సినీ ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న నటుడు సంతానం. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలను చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇండస్ట్రీలో మంచి హాస్యం పండించే పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సంతానం.. ఇప్పటికే హీరోగా మారి తమిళ ఇండస్ట్రీలో అలరిస్తూనే ఉన్నాడు. అయితే హీరోగా మారాక సంతానం చాలా బిజీ అయిపోయాడు. టీవీ నటుడుగా కెరీర్ ప్రారంభించిన సంతానం ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ యాక్టర్. అటు కమెడియన్ గాను ఇటు కథానాయకుడు గాను ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. అయితే సంతానం తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఎలాగంటే తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమాయ్యాడు సంతానం. అతను నటించిన రాజారాణి, సింగం, రోబో, ఓకేఓకే లాంటి ఎన్నో సినిమాలు తెలుగు రాష్ట్రాలలో హిట్ అయ్యాయి.
అయితే ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీకే పరిమితమైన సంతానం త్వరలో తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్ట బోతున్నాడట. ప్రస్తుతం హీరోగా చేతినిండా సినిమాలతో సంతానం ఫుల్ బిజీ. కానీ అతను నటించిన కొత్త సినిమా 'సభాపతి'. ఈ సినిమాను తెలుగులో కూడా అనువాదం చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సభాపతి సినిమా.. ఈ వేసవి లోపల తమిళ, తెలుగు బాషలలో విడుదల చేయనున్నారు. శ్రీనివాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంతానం సరసన పుగల్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి తమిళ హీరోల సినిమాలను ఆదరించేందుకు తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ రెడీగానే ఉంటారు. చూడాలి మరి సంతానం సభాపతి ఎలా అలరిస్తుందో..!