Begin typing your search above and press return to search.

స్టార్‌ కమెడియన్‌ బ్యాన్‌

By:  Tupaki Desk   |   15 Sep 2018 1:52 PM GMT
స్టార్‌ కమెడియన్‌ బ్యాన్‌
X
తమిళ సినిమా ఇండస్ట్రీలో కమెడియన్‌ అనగానే ఠక్కున వినిపించే పేరు వడివేలు. తెలుగు కమెడియన్‌ బ్రహ్మానందం కంటే ఎక్కువ క్రేజ్‌ ను దక్కించుకున్న వడివేలు కేవలం తమిళ సినిమా పరిశ్రమకే పరిమితం కాలేదు. సౌత్‌ లోని అన్ని భాషల ప్రేక్షకుల్లో కూడా వడివేకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. వడివేలు నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో డబ్‌ అవ్వడంతో తెలుగులో ఆయనకు మంచి ఆధరణ ఉంది. తమిళంలో స్టార్‌ కమెడియన్‌ గా కొనసాగుతున్న సమయంలో రాజకీయాల వైపు అడుగులు వేశాడు. రాజకీయాల్లోకి వెళ్లడం వడివేలు చేసిన పెద్ద తప్పు. ఆ తప్పును తెలుసుకుని వడివేలు మళ్లీ సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చాడు.

రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వడివేలు పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. సినిమాలను ఒప్పుకుని షూటింగ్స్‌ కు రాకపోవడం - కొన్ని సార్లు షూటింగ్స్‌ కు తాగి రావడం - ఆలస్యంగా రావడం - దర్శకుడు చెప్పినట్లుగా వినకపోవడం ఇలా పలు ఫిర్యాదులు ఇటీవల వడివేలుపై ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నమోదు అయ్యాయి అంటూ సమాచారం అందుతుంది. అయినా కూడా ఈయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతూనే ఉన్నారట. కాని ఈయన మాత్రం తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతున్నాడు. తాజాగా తమిళ సినిమా పరిశ్రమ పెద్దలు తనను బ్యాన్‌ చేసే వరకు తెచ్చుకున్నాడు.

కొన్నేళ్ల క్రితం ‘హింసై అరసన్‌ 23వ పులకేసి’ చిత్రం తెరకెక్కింది. ఆ చిత్రంకు శంకర్‌ శిష్యుడు చింబుదేవన్‌ దర్శకత్వం వహించాడు. మళ్లీ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ చేయాలనే ఆలోచనతో చింబుదేవన్‌ స్క్రిప్ట్‌ ను సిద్దం చేశాడు. శంకర్‌ స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. వడివేలు కూడా సినిమాలో నటించేందుకు ముందుకు వచ్చి డేట్లు కూడా ఇచ్చాడు. సినిమాకు సంబంధించి అంతా సిద్దం చేసిన సమయంలో వడివేలు షూటింగ్‌ కు రాకుండా ఇబ్బంది పెడుతున్నాడు అంటూ చింబుదేవన్‌ గత కొన్ని రోజులుగా తమిళ సినీ ఇండస్ట్రీ పెద్దల ముందు వాపోతున్నాడట.. సినిమా చేయను అంటూ వడివేలు తేల్చి చెప్పడంతో ఇప్పటి వరకు తాము ఖర్చు చేసిన 9 కోట్లు ఇప్పించాల్సిందిగా శంకర్‌ తమిళ నిర్మాతల మండలి ముందు కోరడం జరిగింది. అందుకు కూడా వడివేలు స్పందించక పోవడంతో తమిళ నిర్మాతల మండలి వడివేలును ఇండస్ట్రీ నుండి నిషేదిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇకపై వడివేలుకు ఎవరు కూడా సినిమాల్లో అవకాశాలు ఇవ్వకూడదు అంటూ నిర్మాతల మండలి పెద్దలు ఆదేశించారు. ఇప్పటికైనా వడివేలు ఈ విషయమై శంకర్‌ మరియు చింబుదేవన్‌ తో రాజీకి వచ్చి, మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటాడా అనేది కాలమే నిర్ణయిస్తుంది.