Begin typing your search above and press return to search.

అనివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న స్టార్ కపుల్..!

By:  Tupaki Desk   |   15 March 2021 4:02 PM GMT
అనివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న స్టార్ కపుల్..!
X
సినీఇండస్ట్రీలో ఎందరో స్టార్ కపుల్స్ ఉన్నారు. అందులో ఎందరో స్ఫూర్తి కలిగించే కపుల్స్ ఉన్నారు. అలాంటి వారిలో స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా దంపతులు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ స్టార్ కపుల్ ఈరోజుతో ప్రేమలో పడి ఇరవై సంవత్సరాలు అవుతున్న సందర్బంగా సోషల్ మీడియాలో తమ విషెస్ తో పాటు ప్రేమను వెల్లడించారు. ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కష్యప్.. ఇంస్టాగ్రామ్ వేదికగా తమ అనివెర్సరీకి సంబంధించిన పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కు రిప్లై ఇస్తూ ఆయుష్మాన్ కూడా స్పందించడంతో సోషల్ మీడియాలో ఈ స్టార్ కపుల్ పోస్ట్ వైరల్ అవుతోంది. తన భర్త ఆయుష్మాన్ తో జీవితం ఇరవైఏళ్లుగా హ్యాపీగా సాగుతుందని తాహిరా కష్యప్ ఇంస్టాలో ఓ ఫోటో కొల్లాజ్ కూడా షేర్ చేసింది.

ఆయుష్మాన్, తాహిరా ఇద్దరూ కూడా 12వ తరగతిలో ప్రొపోజ్ చేసుకున్నారట. అదికూడా ల్యాండ్ ఫోన్ ద్వారా ప్రేమను చెప్పుకోవడం చాలా బాగుంది. తాహిరా మాట్లాడుతూ.. 'అది 2001లో జరిగింది. మేము మా బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నాము. ఉదయం 1.48 గంటలకు నేను ఫోన్‌లో ఆయుష్మాన్ ప్రేమను అంగీకరించాను. ఈనాటికి 19 సంవత్సరాలు గడిచింది' అంటూ వాయిస్ ఓవర్ తో పోస్ట్ పెట్టింది. దానికి ఆయుష్మాన్ రిప్లై ఇస్తూ భార్య పోస్టును తన ఇంస్టా స్టోరీస్ లో పోస్ట్ చేసాడు. ఇది మేం పన్నెండవ క్లాస్ లో ఉన్నప్పుడు జరిగింది. అప్పటినుండి మా ప్రయాణం మొదలయింది అంటూ రాసాడు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు.. వీర్ విరాజ్, వరుష్క. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆయుష్మాన్ అనేక్ అనే సినిమా చేస్తున్నాడు. అనుభవ్ సిన్హా డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే చండిఘర్ కరే ఆషికి, డాక్టర్ జి సినిమాలు లైన్ లో ఉన్నాయి.