Begin typing your search above and press return to search.
8 ఎకరాల్లో లావిష్ ఫామ్ హౌస్..ఆ జంట కోసం ప్రత్యేకంగా!
By: Tupaki Desk | 2 Sep 2022 6:09 AM GMTస్టార్ కపుల్స్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. ఇద్దరి జీవితాల్లో కి వామిక రావడంతో మరింత సంతోషంగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా తమకంటూ కొంత స్పేస్ కేటాయించుకుంటారు. ఆ స్పేస్ లో ఎంజాయ్ మెంట్ ని ప్లాన్ చేసుకుంటారు. పెళ్లైన దగ్గర నుంచి నేటి వరకూ ఈ స్పేస్ అనే ప్లానింగ్ లో ఏమాత్రం రాజీ పడరు.
ఎవరెంత బిజీగా ఉన్నా ఆ సమయం వచ్చిందంటే? అన్ని పనుల్ని పక్కనబెట్టేస్తారు. ఇక ఈ జంట ఆదాయవనరుల గురించి చెప్పాల్సిన పనిలేదు. విరాట్ టీమ్ ఇండియా ఆటగాడిగా కొనసాగూతనే బ్రాండింగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.ఇప్పుడున్న ఇండియా ప్లేయర్స్ అందరికంటే అత్యధిక ఆదాయం గల ఆటగాడిగా విరాట్ కొనసాగుతున్నారు.
ఒక్కో యడ్వటైజ్ మెంట్ కి కోట్ల రూపాయల పారితోషికం తీసు కుంటున్నారు. ఇక ఐపీఎల్ ల్లోనూ విరాట్ కి మంచి డిమాండ్ ఉంది. ఏడాదిలో కోట్ల రూపాయల ఆదాయం ఒక్క ఐపీఎల్ సీజన్ లో జుర్రేస్తున్నాడు. ఇక సతీమణి అనుష్క నటిగా కొనసాగుతూనే సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గానూ ముందుకు సాగుతుంది. నిర్మాతగాను మంచి ఆదాయం వెనకేస్తుంది.
అలాగే కమర్శియల్స్ చేస్తుంది. ఆ మధ్య ప్రముఖ కార్పోరేట్ ఓటీటీ కంపెనీతో ఒప్పందం చేసుకుని 200 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇలా అన్ని రకాలుగా దంపతులిద్దరు ఆర్ధికంగా స్ర్టాంగ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించడమే పనిగా ముందుకు సాగుతున్నారు. ఇక ముంబైలో ఈ జంట విక్రయించిన అపార్ట్ మెంట్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
పలు ప్రైమ్ ఏరియాల్లో ఖరీదైన అపార్ట్ మెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై పరిసరాల్లో గల అలీభాగ్ లో ఏకంగా 8 ఎకరాల స్థలం కొనుగోలు చేసారుట. అందుకోసం 19.24 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆ ల్యాండ్ తాలుకా ట్రాన్ససక్షన్ సైతం పూర్తయిందని సమాచారం. అతి త్వరలోనే ఆ స్థలంలో ఓ లావిష్ ఫామ్ హౌస్ నిర్మించనున్నారుట.
అనుష్క శర్మ అభిరుచి మేరకు ఆ పామ్ హౌస్ కట్టడం జరుగుతుందని అంటున్నారు. ఇదే ప్రాంతంలో బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది ఫామ్ హౌస్ లు..ఖాళీ స్థలాలు కలిగి ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే అక్కడ డెవలప్ అవుతుంది. ఆ ప్లానింగ్ తోనే విరాట్-అనుష్క దంపతులు సైతం స్థలం కొన్నట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.