Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: స్టార్ కపుల్స్ కాస్ట్ లీ విడాకులు
By: Tupaki Desk | 10 Dec 2022 3:38 AM GMTవివాహాలు స్వర్గంలో జరుగుతాయని దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ప్రశాంతంగా అనుభవించాలని కోరుకునే ఒక అందమైన సామెత ఉంది. కానీ టైమ్ బాగోక విడిపోవాల్సిన సన్నివేశాన్ని కొన్ని జంటలు ఎదుర్కొంటున్నాయి. ఒక సుదీర్ఘమైన బాధాకరమైన ప్రక్రియలో ఈ జంటలు విడాకులను ఎదుర్కొంటారు.
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో విడాకులు సర్వసాధారణం. చాలామంది B-టౌన్ జంటలు విడిపోయారు. అయితే కోర్టు తీర్పు మేరకు జీవిత భాగస్వామికి భరణంగా భారీ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ విడాకుల నుండి హృతిక్ రోషన్ - సుస్సేన్ ఖాన్ వరకు.. బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన విడాకుల వివరాలను పరిశీలిస్తే తెలిసిన సంగతులివి.
స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్- నటి అమృతా సింగ్ జంట 13ఏళ్ల దాంపత్య జీవనం తర్వాత విడిపోయారు. పటౌడీ సంస్థాన రాకుమారుడైన సైఫ్ ఖాన్ తన మొదటి భార్య అమృతకు భరణంగా భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉందని కథనాలొచ్చాయి. అయితే ఆ మొత్తం ఎంత అనేది వారు వెల్లడించలేదు. సైఫ్ సంపదలో దాదాపు సగం చెల్లించాల్సి ఉంటుందని గుసగుసలు వినిపించాయి. సైఫ్ తన భార్యకు రూ.5 కోట్లు భరణం ఇవ్వాలని వారసుడు ఇబ్రహీంకు 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు 1 లక్ష ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు తీర్పు వెలువరించినట్టు కథనాలొచ్చాయి.
సంజయ్ కపూర్-కరిష్మా కపూర్ విడాకులు కూడా కాస్ట్ లీ ఎఫైర్ గానే ముగిసింది. ఈ జంట ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. ఇద్దరూ తమ 13 సంవత్సరాల వివాహ బంధాన్ని ముగించారు. సంజయ్ తండ్రి నివాసం(ఇల్లు)పై హక్కులను యాజమాన్యాన్ని కరిష్మా తన పేరుకు బదిలీ చేయించుకుంది. ఆమె బాండ్ల నుండి నెలవారీ రూ. 10 లక్షల వడ్డీని కూడా అందుకుంటోంది. తన పిల్లల పేర్ల మీద 14 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి.
హృతిక్ రోషన్-సుసానే ఖాన్ జంట 2014లో విడిపోయారు. సుస్సానే భరణంగా రూ. 400 కోట్లు డిమాండ్ చేసింది. 380 కోట్లు చెల్లించాల్సి ఉందని హృతిక్ ఈ వార్తలను ఖండించారు.
మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ బ్రేకప్ గురించి తెలిసిందే. ఈ జంట 13 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని గడిపారు. పెళ్లికి ముందు ఇద్దరూ ఐదేళ్ల పాటు డేటింగ్ చేశారు. కానీ అనూహ్యంగా ఈ జంట విడిపోయారు. మలైకా రూ.10 నుంచి 15 కోట్ల మేర భరణం తీసుకుందని సమాచారం.
నటుడు దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్- అధునా భబానీ 16 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. 2016 లో ఈ జంట విడిపోయారు. ఫర్హాన్ నెలవారీ భత్యానికి బదులుగా వన్-టైమ్ భరణం మొత్తాన్ని చెల్లించాడు. అధునా 10000 చదరపు అడుగుల భవనం 'విపాసన'ను కూడా దక్కించుకుంది. ఫర్హాన్ ఇటీవల మరొక నటి శిభాని దండేకర్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో నాగచైతన్య - సమంత జంట విడాకుల వ్యవహారం పైనా రకరకాల గుసగుసలు వినిపించాయి. ఈ బ్రేకప్ అనంతరం అక్కినేని కుటుంబం నుంచి భారీ మొత్తాన్ని సమంత అందుకుందని గుసగుసలు వినిపించాయి. అయితే సంపాదకురాలైన సామ్ తన మాజీ భర్త చైతూ నుంచి ఏమీ ఆశించలేదని కూడా కొన్ని మీడియాల్లో కథనాలొచ్చాయి. కానీ భరణం వగైరా అంశాలపై పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.