Begin typing your search above and press return to search.

OTT స్టార్ తో స్టార్ డాట‌ర్ రొమాంటిక్ డేట్

By:  Tupaki Desk   |   28 Aug 2021 2:30 AM GMT
OTT స్టార్ తో స్టార్ డాట‌ర్ రొమాంటిక్ డేట్
X
ఓటీటీ స్టార్లు మెయిన్ స్ట్రీమ్ స్టార్లుగా ఏల్తున్నారు. అగ్ర క‌థానాయిక‌లు అయినా ఓటీటీ స్టార్ల‌కు స‌లాం అనేస్తున్నారు. ఇక యువ‌న‌టుడు విక్రాంత్ మాస్సే గురించి ఓటీటీ అభిమానుల‌కు ప‌రిచయం అవ‌స‌రం లేదు. అత‌డు కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా న‌టించాడు. కానీ పెద్ద తెర క‌న్నా బుల్లితెర విక్రాంత్ కి ఎన‌లేని గౌర‌వాన్ని.. గుర్తింపును తీసుకొచ్చింది. గ‌త ఏడాది ఏకంగా నాలుగు వెబ్ సిరీస్ లు రిలీజ్ చేసి ప్రేక్ష‌కుల‌కు మ‌రింత‌గా రీచ్ అయ్యాడు. ఇప్పుడు ఓటీటీలో విక్రాంత్ మాస్సే అంటే ఓ వైబ్రేష‌న్. అంత‌గా అత‌ను ఫేమ‌స్ అయ్యాడు. ఇప్పుడు ఆ గుర్తింపు ఏకంగా స్టార్ డాట‌ర్ తోనే న‌టించే ఛాన్స్ కు దారి తీసింది. విక్రాంత్ హీరోగా `టిప్స్` అనే చిత్రం తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్దం అవుతోంది. ఇందులో సైప్ అలీఖాన్ డాట‌ర్ సారా అలీఖాన్ ని హీరోయిన్ గా ఫైన‌ల్ చేసారు.

దీంతో ఈ ప్రాజెక్ట్ కి మ‌రింత బ‌జ్ వ‌స్తోంది. ఆన్ స్క్రీన్ పై ఈ యంగ్ ఫెయిర్ బ్యూటీఫుల్ గా క‌నిపిస్తుంద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు ప‌డుతున్నాయి. ఓటీటీ స్టార్ తో స్టార్ డాట‌ర్ రొమాన్స్ అద్భుతంగా ఉంటుంద‌ని కామెంట్లు పెడుతున్నారు. సారా అలీఖాన్ ఇప్ప‌టికే బిజీ నాయిక‌గా మారింది. `కేధ‌ర‌నాథ్` సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు `సింబా`..`ల‌వ్ ఆజ్ క‌ల్` చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్ లు ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం `ఆంత్ర‌గిరే` అనే చిత్రంలో న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల కానుంది. తాజాగా `టిప్స్` లోనూ చాన్స్ ద‌క్కించుకుంది. ఇంకా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో నూ అమ్మ‌డికి అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

ఇక ఫిట్ నెస్ విష‌యంలో సారా అలీఖాన్ ఎంత కేర్ ఫుల్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం జిమ్..యోగా మెడిటేష‌న్ అంటూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. గ్లామ‌ర్ ఐకాన్ గా వెలిగిపోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. మారుతున్న ట్రెండ్ క‌నుగుణంగా ఆల్ట్రా మోడ్ర‌న్ గాళ్ లుక్ తో కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొడుతోంది. టెంప్టింగ్ ఫోటో షూట్ల‌తో యువ‌త‌రానికి ఈ బ్యూటీ ఎంతో చేరువైంది.

సారా కెరీర్ ప‌రంగా బిజీ నాయిక‌గా వెలిగిపోతోంది. ఈ యంగ్ బ్యూటీ ఇటీవ‌ల అట్రాంగి రే చిత్రీక‌ర‌ణ‌లోనూ పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవ‌లే పూర్త‌యింది. ఇందులో అక్షయ్ కుమార్ .. ధనుష్ లతో కలిసి సారా నటించింది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.