Begin typing your search above and press return to search.

దారుణ‌మైన డిప్రెష‌న్ లోకి వెళ్లిన స్టార్ డాట‌ర్

By:  Tupaki Desk   |   10 Feb 2021 10:54 AM GMT
దారుణ‌మైన డిప్రెష‌న్ లోకి వెళ్లిన స్టార్ డాట‌ర్
X
జీవితంలో ఒంట‌రిత‌నం తీవ్ర‌మైన ఒత్తిళ్ల‌కు కార‌ణ‌మ‌వుతుంటుంది. కొంద‌రికి హాస్ట‌ల్ లైఫ్ కూడా అలాంటి ప‌రిస్థితి తీసుకుని వ‌స్తుంది. కుటుంబ క‌ల‌త‌లు.. అమ్మా నాన్న విడిపోవ‌డం వంటి విష‌యాలు కూడా పిల్ల‌ల మాన‌సిక స్థితిని ప్ర‌భావితం చేస్తుంటాయి. ఇలాంటి అనేక కార‌ణాలు త‌న డిప్రెష‌న్ కి కార‌ణ‌మ‌య్యాయ‌ని ఇంత‌కుముందే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ వెల్ల‌డించారు.

తాను డిప్రెషన్ ‌తో పోరాడుతున్నానని గ‌త ఏడాది వెల్లడించిన అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన మానసిక ఆరోగ్యం గురించి ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌కు ఓపెన్ అయ్యింది. ''ఇది సంతోషకరమైన సానుకూల వీడియో కాదు. ఇది సంతోషకరమైన ప్రతికూల వీడియో కాదు. కానీ నేను ... బ్లా .. మీరు త‌క్కువ‌గా చూడ‌కుంటే... దీనికి మీరే న్యాయమూర్తిగా ఉండండి'' అని వ్యాఖ్యానించింది. జీవితంలో నైరాశ్యానికి సంబంధించిన ఎన్నో విష‌యాల్ని తన అభిమానులకు అర్థం చేసుకోవడానికి రెగ్యులర్ వీడియోలను పోస్ట్ చేయాలనుకుంటున్నానని వెల్ల‌డించింది.

ఒక్కోసారి ఆనందంగా ఉన్న‌ట్టు అంద‌రికీ క‌నిపించినా.. నేను ఇంటికి వచ్చి ఏడుస్తాను అని అన‌డం కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తన కజిన్ జయాన్ ఖాన్ వివాహ వేడుక‌ల‌కు తన తండ్రి అమీర్ ఖాన్ తో కలిసి వెళ్లాన‌ని ఫోటోలలో న‌వ్వుతూ క‌నిపిస్తాన‌ని కూడా తెలిపిన ఇరా.. ఇంటికి వ‌చ్చి ఏడ్చాన‌ని వెల్లడించింది. ఇలా ప్ర‌తిచోటికి వెళ్లినా కానీ తిరిగి వ‌చ్చాక ఏడ్చేస్తానంది.

ప‌ని చేస్తుంటాను.. ఏడుస్తూ ఉంటాను అని త‌న మాన‌సిక స్థితిని బ‌హిరంగంగా వెల్ల‌డించింది. ''ప్ర‌స్తుతం నేను బాగానే ఉన్నాను. కానీ నేను చాలా ఏడుస్తున్నాను'' అని అన‌డం ఇంకా ఇంకా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. రీనా ద‌త్తా నుంచి విడిపోయాక అమీర్ కిర‌ణ్ రావును పెళ్లాడారు. ఇరా ఖాన్ రీనా ద‌త్తా- అమీర్ జంట‌ కుమార్తె అన్న సంగ‌తి తెలిసిన‌దే.