Begin typing your search above and press return to search.
మహేష్ బాబు బావ పాత్రలో స్టార్ డైరెక్టర్
By: Tupaki Desk | 22 March 2019 6:00 AM GMTటాలీవుడ్ సెన్షేషన్ మూవీ అర్జున్ రెడ్డి హిందీ మరియు తమిళంలో రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే. హిందీలో ఒరిజినల్ వర్షన్ కు డైరెక్షన్ చేసిన సందీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తమిళంలో బాలా దర్శకత్వం చేయగా ఆయన తీసిన వర్షన్ బాగాలేదని మొత్తం రీ షూట్ కు సిద్దం అయ్యారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ కు సందీప్ వంగ శిష్యుడు గిరీషయ్యను ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. వర్మ అనే టైటిల్ తో ఈ చిత్రం రాబోతుంది. తాజాగా ఈ చిత్రం కోసం ప్రముఖ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక పాత్ర చేసేందుకు ఒప్పుకున్నాడట.
ఒరిజినల్ అర్జున్ రెడ్డి చిత్రంలో హీరో పాత్రకు తండ్రి పాత్రను మహేష్ బాబు బావ సంజయ్ స్వరూప్ పోషించారు. కనిపించేది కొద్ది సమయమే అయినా ఆ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హీరో ఫాదర్ పాత్ర అవ్వడం వల్ల తమిళంలో పలువురు నటులను సంప్రదించారు. ఎంతో మందిని పరిశీలించిన తర్వాత చివరకు డైరెక్టర్ గౌతమ్ మీనన్ ను ఆ పాత్రకు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు బావ అయిన సంజయ్ స్వరూప్ తెలుగు అర్జున్ రెడ్డిలో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇప్పుడు అదే తరహాలో గౌతమ్ వాసు దేవ్ మీనన్ ఉంటాడు కనుక ఆయన్ను ఎంపిక చేసి ఉంటారనే టాక్ వినిపిస్తుంది.