Begin typing your search above and press return to search.

సూపర్ హిట్‌ సీక్వెల్‌ లో విలన్ గా స్టార్‌ డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   23 Nov 2022 6:30 AM GMT
సూపర్ హిట్‌ సీక్వెల్‌ లో విలన్ గా స్టార్‌ డైరెక్టర్‌
X
కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఖైదీ కి సీక్వెల్ ను రూపొందించే పనిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఉన్నాడు. ఖైదీ సినిమా చివర్లో సీక్వెల్‌ ఉంటుంది అన్నట్లుగా ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెల్సిందే.

ఖైదీ సీక్వెల్‌ కు ముందు కమల్‌ హాసన్ తో విక్రమ్‌ అనే సినిమాను తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్‌ ను దక్కించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ పాన్‌ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. అందుకే ఆయన దర్శకత్వంలో సినిమా అంటే స్టార్స్ నుండి సూపర్‌ స్టార్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నారు.

సూపర్ హిట్‌ విక్రమ్‌ లో ఖైదీ సినిమా తాలూకు ఇన్‌ పుట్స్ ను ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఖైదీ సీక్వెల్‌ లో విక్రమ్ స్టార్‌ రోలెక్స్ టీమ్‌ లోని ఒక కీలక వ్యక్తిని విలన్ గా చూపించబోతున్నాడట. రోలెక్స్ టీమ్‌ లోని ఆ కీలక వ్యక్తిగా ప్రముఖ దర్శకుడు కమ్‌ నటుడు అయిన రాఘవ లారెన్స్ కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఖైదీ 2 లో రాఘవ లారెన్స్ విలన్ పాత్ర ను చేయబోతున్నట్లుగా తమిళ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కొరియోగ్రఫర్‌ గా.. నటుడిగా.. హీరోగా.. దర్శకుడిగా.. నిర్మాతగా ఇలా ఎన్నో పాత్రల్లో తన బాధ్యతలను నిర్వర్తించిన లారెన్స్‌ ఖైదీ 2 లో మొదటి సారి పూర్తి స్థాయి నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం ఈ విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళంతో పాటు తెలుగు లో కూడా లారెన్స్ కి మంచి గుర్తింపు ఉంది. కనుక ఈ సినిమా లో ఆయన పాత్ర అన్ని వర్గాల వారిని.. మరియు అన్ని భాషల వారిని కూడా మెప్పిస్తుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రముఖి 2 ను చేస్తున్న లారెన్స్ మరో వైపు ఖైదీ 2 తో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.