Begin typing your search above and press return to search.

ఆ స్టార్ డైరెక్టర్ కు డబ్బుల కొరతా!!

By:  Tupaki Desk   |   18 Jun 2017 9:52 AM GMT
ఆ స్టార్ డైరెక్టర్ కు డబ్బుల కొరతా!!
X
టాలీవుడ్ లో ఆయన ఓ స్టార్ డైరెక్టర్. తన సినిమాలతో ఆడియన్స్ ను థ్రిల్ చేయడంలో ఆయన మాస్టర్లకే మాస్టర్. ఆయన ఉన్న రేంజ్ ప్రకారం.. ఆర్థిక ఇబ్బందులు అనే మాట ఆయన దరి చేరడం కూడా కష్టమే. అయినా సరే.. ప్రస్తుతం చేతిలో డబ్బులు లేక ఆయన ఇబ్బంది పడుతున్నాడనే మాట టాలీవుడ్ లో వినిపిస్తోంది.

నిజానికి ఈ దర్శకుడి రీసెంట్ మూవీ సాధించిన విజయం తర్వాత.. జీవితం మొత్తంలో మరింకేమీ పని చేయకపోయినా.. తరతరాలు గడిపేయచ్చని.. అంత మొత్తం సమకూరిందని అంటారు. అలాంటి ఈయనకు డబ్బుల కొరత ఏంటి అనే అనుమానం రావచ్చు కానీ.. ఇందుకు కారణం ఈ దర్శకుడు తన డబ్బులు అన్నిటినీ స్థిరాస్తులపై పెట్టేశాడట. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తనకు దక్కిన సొమ్ములు అన్నింటినీ పదుల కొద్దీ ఎకరాల భూములు.. ఆస్తులు కొనుగోలు చేసేయడంతో.. బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కరిగిపోయిందని అంటున్నారు. అందుకే ఈయనకు చేతిలో లిక్విడ్ క్యాష్ లేకుండా పోయిందట. దీంతో ఈయన వేసుకున్న ఫారిన్ ట్రిప్ కూడా వాయిదా పడుతోందని తెలుస్తోంది.

ఈ దర్శకుడి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఈయన సై అనగానే లాంగే వెకేషన్ వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా.. తన ఖాతాలో తగినన్ని సొమ్ములు సమకూరాకే వెళ్లాలని భావిస్తున్నాడట ఆయన. అయితే.. ఇందులో వాస్తవం లేదని.. తనతో పాటు తీసుకెళ్లాలని భావించిన కొందరు సన్నిహితులకు ఇంకా ఫారిన్ ట్రిప్ కు ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతోనే.. ఈ వెకేషన్ పోస్ట్ పోన్ అవుతోందన్నది సన్నిహితుల మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/