Begin typing your search above and press return to search.
180 కోట్లకు స్టార్ డైరెక్టర్ షూరిటీ
By: Tupaki Desk | 7 Jan 2022 4:30 PM GMTభారీ బడ్జెట్ తో రూపొందిన ఒక సినిమా రిలీజ్ వాయిదా పడిందంటే దాని ప్రభావం నిర్మాత ఒక్కడిపైనే కాకుండా దాన్ని తెరకెక్కించిన దర్శకుడు, అందులో నటించిన నటీనటులు, పని చేసిన సాంకేతిక నిపుణులు.. భారీ మొత్తాలు చెల్లించి ఏరియాలు కొన్న బయ్యర్స్ పై వుంటుందన్నది తెలిసిందే. అంతే కాకుండా మిగతా సినిమాలపై కూడా దాని ప్రభావం వుంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ పెద్ద సినిమా రిలీజ్ ఆగిపోవడం చర్చనీయాంశంగా మారింది.
అంతే కాకుండా ఈ మూవీ ఫైనాన్స్ కి దర్శకుడు తనదే బాధ్యత అంటూ షూరిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అపజయమెరుగని ఓ స్టార్ డైరెక్టర్.. వందల కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా.. దేశ వ్యాప్తంగా క్రేజీ ప్రాజెక్ట్ గా పాపులారిటీని దక్కించుకున్న సినిమా.. థియేటర్లలోకి వచ్చేస్తోందని అంతా ఆశగా ఎదురు చూశారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల, దేశ వ్యాప్తంగా మారుతున్న కోవిడ్ పరిస్థితుల కారణంగా భారీ సినిమా విడుదల ని చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వచ్చింది.
దీంతో ఈ సినిమాకు కొత్త సమస్య వచ్చిపడింది. ఎక్కువ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు ఎప్పుడో అడ్వాన్సులు చెల్లించేశారు. అయితే సినిమా ప్రతీసారీ డిలే అవుతుండటంతో వడ్డీలు తడిసిమోపెడు అవుతున్నాయట. దీంతో వడ్డీల భారాన్ని మోయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఇలా వుంటే మరో పక్క ఈ సినిమాకు ఫైనాన్స్ చేసిన వారి పరిస్థితి మరోలా వుంది. ఈ భారాన్ని మోయలేక నిర్మాతలు అధిక టెన్షన్ కి గురవుతున్నాడట.
ఈ సినిమాకు తెచ్చిన ఫైనాన్స్ 180 కోట్లు. ఇది ఇప్పుడు నిర్మాతకు తలకు మించిన భారంగా మారినట్టుగా తెలుస్తోంది. దీన్ని గమనించిన దర్శకుడు ఆ మొత్తానికి తానే షూరిటీగా వుంటానని ఫైనాన్షియర్ లకు మాట ఇవ్వడమే కాకుండా మరో ఆలోచన లేకుండా తనే ఆ బాధ్యతను తీసుకుంటానని షూరిటీ సంతకం పెట్టి నిర్మాతను ఒత్తిడి నుంచి తప్పించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
భారీ మూవీల విషయంలో ఫైనాన్షియర్ లు పెద్దగా టెన్షన్ పడరు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి ఎక్కడికీ పోదని, సేఫ్ గా చేతికి వచ్చేస్తుందని వారి బలమైన నమ్మకం. కానీ తాజాగా ఈ భారీ మూవీ విషయంలో వారు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారట. మారుతున్న పరిస్థితులు.. కారణంగా ఫైనాన్షియర్స్ కూడా ఈ సినిమా విషయంలో భయానికి గురవుతున్నారట. అయితే తాజాగా స్టార్ డైరెక్టర్ 180 కోట్ల బాధ్యత తనదేనని షూరిటీ సంతకం చేయడంతో వారు కూడా రిలీఫ్ అయినట్టుగా తెలుస్తోంది.
ఆ దర్శకుడి ధైర్యం ఏంటీ? ఇంత భారీ మొత్తానికి షూరిటీగా సంతం చేడం వెనకున్న కాన్ఫిడెంట్ ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. పరిస్థితులు మారితో సినిమా రిలీజ్ అవుతుంది. దాంతో ఫైనాన్షియర్ ల మొత్తం కట్టేయొచ్చు. కానీ పరిస్థితులు మారకపోతే ఏంటని ధర్మ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాకు కూడా ఇదే తరహా పరిస్థితులు తలెత్తితే ఆ సినిమా డైరెక్టర్ ఆ బాధ్యతలు తనవేనంటూ ముందుకు రావడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
తనని నమ్మి కోట్లు పెట్టిన నిర్మాత శ్రేయస్సు కోసం స్టార్ డైరెక్టర్ లు ఇలా ముందుకు రావడం ఇండస్ట్రీలో గొప్ప సంస్కృతికి నాంది పలికినట్టయిందని అంతా చెప్పుకుంటున్నారు.