Begin typing your search above and press return to search.

ఓటీటీలో స్టార్ డైరెక్ట‌ర్ వార‌సుడి సినిమా?

By:  Tupaki Desk   |   28 March 2021 11:30 AM GMT
ఓటీటీలో స్టార్ డైరెక్ట‌ర్ వార‌సుడి సినిమా?
X
స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ వార‌సుడు ఆకాష్ కెరీర్ డైల‌మా గురించి ఇటీవ‌ల తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత‌డు న‌టించిన తొలి సినిమా `మెహ‌బూబా` ఫ్లాపైనా న‌టుడిగా మంచి మార్కులే వేయించుకున్నాడు. డాడీలానే ఆకాష్ డ్యాషింగ్ స్టైల్ ఉన్న న‌టుడు.. హీరోగా ఎదిగేందుకు ఆస్కారం ఉంది! అంటూ క్రిటిక్స్ ప్ర‌శంసించారు. కానీ ఆ త‌ర్వాత రెండో సినిమా విష‌యంలోనే త‌డ‌బాటు క‌నిపిస్తోంద‌న్న విమ‌ర్శ‌లున్నాయి.

ఆకాష్ పూరి న‌టించిన రొమాంటిక్ షూటింగ్ పూర్త‌యినా రిలీజ్ విష‌యంలో ఎందుక‌నో డైల‌మా కొన‌సాగుతోంది. ఇటీవ‌ల లాక్ డౌన్ క్రైసిస్ వ‌ల్ల వాయిదా ప‌డింది అనుకున్నా.. ఇప్పుడు థియేట‌ర్లు రీలాంచ్ అయ్యి సినిమాలు ఆడుతున్నాయి. కానీ రొమాంటిక్ ఎందుక‌నో రిలీజ్ కావ‌డం లేద‌న్న ఆవేద‌న పూరి అభిమానుల్లో ఉంది. ఇంత‌కీ రొమాంటిక్ రిలీజ్ తేదీ ఎపుడు? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది.

తాజా స‌మాచారం మేర‌కు రొమాంటిక్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఓటీటీ డీల్ ముగిసినా ఇంకా రిలీజ్ తేదీ వెల్ల‌డించ‌లేద‌ని తెలుస్తోంది. మాఫియా నేప‌థ్యంలో ప్రేమ‌కథా చిత్ర‌మిది. యాక్ష‌న్ ఆక‌ట్టుకుంటుంద‌ట‌. పూరి శిష్యుడు అనీల్ పాడూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా కేతిక శ‌ర్మ ఈ చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది.

ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ను పోషించారు. హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే ఒక ముఖ్య పాత్రలో న‌టించారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్-, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌- ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.