Begin typing your search above and press return to search.

మెగా వీరయ్య కోసం స్టార్‌ డైరెక్టర్స్ తరలి వచ్చారు

By:  Tupaki Desk   |   6 Nov 2021 4:30 PM GMT
మెగా వీరయ్య కోసం స్టార్‌ డైరెక్టర్స్ తరలి వచ్చారు
X
మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు బాబీల కాంబోలో ఒక సినిమా రాబోతుంది అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆమద్య స్వయంగా చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఒక మంచి కథతో సినిమా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఆచార్య సినిమా తర్వాత వరుసగా మూడు సినిమాలకు చిరంజీవి కమిట్ అయ్యాడు. అందులో ఒకటి లూసీఫర్ రీమేక్ కాగా మరోటి తమిళ మూవీ వేదాళంకు రీమేక్. వరుసగా రెండు రీమేక్ లు చేస్తున్న చిరంజీవి మూడవ సినిమాను బాబీ దర్శకత్వంలో కొత్త కథతో సినిమాను చేయబోతున్నట్లుగా మెగా కాంపౌండ్‌ నుండి వార్తలు వచ్చాయి. అయితే లూసీఫర్ రీమేక్‌ తర్వాత వేదాళం రీమేక్ కాకుండా మద్యలోనే బాబీ దర్శకత్వంలో సినిమాను విడుదల చేయాలని మెగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే మెహర్‌ రమేష్ దర్శకత్వంలో వేదాళంకు క్లాప్‌ పడక ముందే బాబీ దర్శకత్వంలో సినిమాకు క్లాప్‌ పడింది.

విశాఖ పోర్ట్‌ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతున్న ఈ సినిమాలో చిరంజీవి మాస్ లుక్‌ అదిరిపోతుందంటూ మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సినిమాకు బాబీ ఇప్పటికే వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ ను అనుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం ఆ విషయాన్ని ప్రకటించలేదు. వాల్తేరు వీరయ్య షూటింగ్‌ ప్రారంభోత్సవం నేడు జరిగిన విషయం తెల్సిందే. షూటింగ్‌ ప్రారంభోత్సవంలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాలకు టాలీవుడ్ దిగ్గజ దర్శకులు హాజరు అవ్వడం చర్చనీయాంశం అయ్యింది.

సీనియర్‌ అయిన రాఘవేంద్ర రావు మొదలుకుని పూరి జగన్నాధ్‌.. వివి వినాయక్‌.. కొరటాల శివ.. హరిష్‌ శంకర్‌ లు హాజరు అయ్యారు. వివి వినాయక్ క్లాప్‌ కొట్టగా సినిమా మొదటి సన్నివేశంను దేవుడి పటాలపై చిత్రీకరించారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ మెగా మూవీకి ఇంత మంది దర్శకుల ప్రోత్సాహం వెనుక ఉందా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీరంద్దరు కూడా స్క్రిప్ట్‌ వ్యవహారంలో సలహాలు సూచనలు ఇచ్చారేమో.. ఒక వేళ అదే నిజం అయితే సినిమా ఊర మాస్ లెక్కలు మామూలుగా ఉండవు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.