Begin typing your search above and press return to search.

పవర్ఫుల్ పాన్ ఇండియా లైనప్ తో స్టార్ డైరెక్టర్స్

By:  Tupaki Desk   |   10 March 2023 6:00 PM GMT
పవర్ఫుల్ పాన్ ఇండియా లైనప్ తో స్టార్ డైరెక్టర్స్
X
సౌత్ ఇండియాలో ప్రస్తుతం స్టార్ దర్శకులు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పాలి. సౌత్ ఇండియా సినిమా స్టాండర్డ్స్ ని ఈ దర్శకులందరూ కూడా ఇండియన్ వైట్ చేశారని చెప్పాలి.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సౌత్ లో స్టార్ దర్శకుల నుంచి రాబోయే చిత్రాలపై ప్రేక్షకుల దృష్టి ఉంది. ఇదిలా ఉంటే సౌత్ లో తెలుగు తమిళ్ స్టార్ దర్శకుల నుంచి రాబోతున్న చిత్రాల వరుస చూసుకుంటే చాలా గ్రాండియర్ గా ఉన్నాయని చెప్పాలి.

రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీని ఈ సంవత్సరం మొదలుపెట్టబోతున్నారు. ప్రశాంత్ నీల్ సలార్ రిలీజ్ చేయడంతో పాటు ఎన్టీఆర్ 31వ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. దాని తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 3 మొదలవుతుంది. కొరటాల శివ ఎన్టీఆర్ 30వ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. లోకేష్ కనగరాజ్ ఇళయ దళపతి విజయ్ తో లియో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.

దీని తర్వాత ఖైదీ సీక్వెల్ ఉంటుంది. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2, రామ్ చరణ్ 15వ సినిమా తెరకెక్కుతున్నాయి. సుకుమార్ పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా షూటింగ్ చేస్తున్నారు. దీని తర్వాత ప్రభాస్ స్పిరిట్ మూవీ స్టార్ట్ అవుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమాలన్నీ కూడా మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ గా సౌత్ ఇండియా నుంచి ఈ రెండేళ్లలో రాబోతున్నాయి. ఈ సినిమాలలో చాలా వరకు 1000 కోట్ల గ్రాస్ ని బీట్ చేసే మూవీస్ కావడం విశేషం. వీరిలో ప్రశాంత్ నీల్ సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్ ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరిస్తాయి అనేది వేసి చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.