Begin typing your search above and press return to search.
2016 గోల్డెన్ గ్లోబ్ స్టార్స్ వీరే!
By: Tupaki Desk | 9 Jan 2017 11:17 AM GMT74వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి లాస్ ఏంజిల్స్ లో అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రం - ఉత్తమ నటీ నటులు - ఉత్తమ టీవీ నటులు వంటి అనేక రకాల అవార్డులు ఈ సందర్భంగా అందచేయడం జరుగుతుంది. అయితే ఈ అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో అమెరికన్ నటి ఎమ్మా స్టోన్ దుమ్మురేపిందనే చెప్పాలి. ఆమె నటించిన రొమాంటిక్ కామెడీ "లా లా ల్యాండ్" సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు గానూ ఈ ఏటి గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఉత్తమ నటి కేటగిరీలో దక్కించుకుంది. ఇదే క్రమంలో అదే సినిమాలోని కథానాయకుడిగా నటించిన ర్యాన్ గోస్లింగ్ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఈ విధంగా "లా లా ల్యాండ్" సినిమాకు మొత్తం ఏడు అవార్డులు దక్కాయి. "మూన్ లైట్" అత్యుత్తమ డ్రామాగా ఎంపికవగా, "జ్యోటోపియా" అత్యుత్తమ ఏనిమేటెడ్ చిత్రంగా, "ఎల్లీ" అత్యుత్తమ విదేశీభాషా చిత్రంగా, "ది క్రౌన్" అత్యుత్తమ టీవీ డ్రామాగా ఎంపికయ్యింది. ఈ కార్యక్రమంలో భారతీయ నటి ప్రియాంక చోప్రా సహా పలు సినీ - టీవీ స్టార్లు సందడి చేశారు. టెలివిజన్ విభాగంలో అవార్డులు ఇవ్వాలని ఆమెను ఆహ్వానించడంతో ప్రియాంక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి వెళ్లింది. ఈ సందర్భంగా అందమైన దుస్తులతో రెడ్ కార్పెట్‌పై నడిచి హల్ చల్ చేసింది.
ఉత్తమ సినిమా- డ్రామా: మూన్‌లైట్
ఉత్తమ సినిమా- మ్యూజికల్/కామెడీ: లా లా ల్యాండ్
ఉత్తమ దర్శకుడు: డామియెన్ ఛాజెల్
ఉత్తమ నటుడు- మ్యూజికల్/కామెడీ: ర్యాన్ గోస్లింగ్
ఉత్తమ నటి- మ్యూజికల్/కామెడీ: ఎమ్మా స్టోన్
ఉత్తమ నటి -డ్రామా: ఇసబెల్లా హుపెర్ట్(‘ఎలీ’ సినిమాకు)
ఉత్తమ నటుడు- డ్రామా: కేసీ ఆఫ్లెక్ (‘మాంచెస్టర్ బై ద సీ’ సినిమాకు)
ఉత్తమ సహాయ నటి: వియోలా డావిస్(‘ఫెన్సెస్’ సినిమాకు)
ఉత్తమ సహాయ నటుడు: ఆరోన్ టేలర్(‘నాక్టర్నల్ యానిమల్స్’ సినిమాకు)
బెస్ట్ టీవీ సిరీస్- డ్రామా: ది క్రౌన్
బెస్ట్ టీవీ సిరీస్- మ్యూజికల్/కామెడీ: అట్లాంటా
బెస్ట్ టెలివిజన్ లిమిటెడ్ సిరీస్: ది పీపుల్స్ వర్సెస్ ఓ.జె. సిప్సన్(అమెరికన్ క్రైమ్ స్టోరీ)
ఉత్తమ టీవీ నటి- డ్రామా: క్లెయిర్ ఫోయ్(ది క్రౌన్)
ఉత్తమ టీవీ నటుడు- డ్రామా: బిల్లీ బాబ్(గొలియాత్)
ఉత్తమ టీవీ నటి- మ్యూజికల్/కామెడీ: ట్రెసి ఎలిస్ రోజ్(బ్లాకిష్)
ఉత్తమ టీవీ నటుడు- మ్యూజికల్/కామెడీ: డోనాల్డ్ గ్లోవర్(అట్లాంటా)
ఉత్తమ టీవీ నటుడు(లిమిటెడ్ సిరీస్): టామ్ హిడెల్‌స్టన్(ది నైట్ మేనేజర్)
ఉత్తమ సహాయ నటి (లిమిటెడ్ సిరీస్): ఒలీవియా కోల్మన్ (ది నైట్ మేనేజర్)
ఉత్తమ సహాయ నటుడు(లిమిటెడ్ సిరీస్): హాగ్ లూరీ (ది నైట్ మేనేజర్)
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/