Begin typing your search above and press return to search.
నంది మాయ నిద్రలో స్టార్ హీరోలు
By: Tupaki Desk | 19 Nov 2017 1:30 AM GMTఏ ఇండస్ట్రీలో అయినా ప్రభుత్వాలు ఒక అవార్డుతో సత్కరిస్తే రెండు మూడు రోజుల వరకు సంబరాలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ టాలీవుడ్ లో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రీసెంట్ గా మూడేళ్ల కు గాను ఒకేసారి నంది అవార్డులను ప్రకటించిన జ్యురి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రతి రోజు ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడని వారు కూడా సెటైర్లు వేస్తున్నారు.
దీంతో అవార్డులను గెలుచుకున్న కొందరు నటులు ఏమి అసలేని పరిస్థితి. చాలా మంది నటీనటులు అవార్డు వచ్చినందుకు ఎదో ఒక విధంగా స్పందిస్తున్నారు. కాని బడా హీరోలు మాత్రం నంది లు తమకి వచ్చినట్లు తెలియదు అనేలా ప్రవర్తిసున్నారు. అవార్డులని గెలిచిన హీరోల్లో బాలకృష్ణ తప్పితే ఎవరు స్పందించలేదు. ఆయన కూడా చాలా లేటుగా లేచి అవలిస్తూ కాపీ అన్నట్లు రెండు మాటలు మాట్లాడేసి వెళ్లిపోయారు. కానీ సూపర్ స్టార్ మహేష్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. స్టయిలిస్ స్టార్ అల్లు అర్జున్.. మాత్రం ఇంకా లేవలేదు అనేలా సేఫ్ జోన్ లో నిద్రపోతున్నారు. దీంతో అసలు వీరికి అవార్డులు వచ్చిన విషయం తెలుసా? లేదా? అంటూ నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు.
సినిమా పరిశ్రమలో ఏ హీరోలకి అవార్డులు అందినా స్పందించే ఇతర నటులు కూడా ఈసారి సోషల్ మీడియాలో సింగిల్ పోస్టు కూడా చేయలేదు. ప్రముఖ దర్శకులు కూడా సింగిల్ ట్వీట్ చేయలేదు. మరి ఇలా అందరూ మాయ నిద్రలో ఉండడం వారికి ఎంత వరకు కరెక్ట్ అనేది చెప్పలేము గాని అవార్డులపై అనుమానాలను కలిగిస్తోందని గట్టిగా చెప్పవచ్చు.